కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చుట్టూ చర్చ

హైదరాబాద్ ముచ్చట్లు:

తెలంగాణ రాజకీయాల్లో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చుట్టూ చర్చ సాగుతూనే ఉంది.. ఆయన కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఏ పార్టీలో చేరతారు? అనే ప్రశ్న అందరినీ తొలచివేస్తోంది. అయితే, ఆయన ఏ పార్టీ నేతలను కలిసినా.. ఆ పార్టీలో చేరతారు అనే ప్రచారం ఎప్పటికప్పుడు సాగుతూనే ఉంటుంది. తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాది వ్యవధి ఉన్నప్పటికీ రాజకీయ పక్షాలు తమ జోరును పెంచుతున్నాయి. అధికార పార్టీ స్పీడ్‌కు బ్రేకులు వేయాలని ప్రతిపక్షాలు భావిస్తుంటే.. వారి వ్యూహాలను చిత్తు చేసి హాట్రిక్ కొట్టాలని టీఆర్ఎస్ ముందుకు సాగుతోంది. దీంతో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాజా పరిస్థితులను గమనిస్తే అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్దం అవుతున్న సంగతి స్పష్టం అవుతోంది. ఇదిలా ఉంటే తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీ ఏర్పాటు అంశం పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.టీఆర్ఎస్ పార్టీకి పోటీగా త్వరలో మరో రాజకీయ వేదిక పురుడు పోసుకోనుందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. టీఆర్ఎస్ నుండి బయటకు వచ్చి ప్రస్తుతం తటస్థంగా ఉన్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో భేటీ కావడం సంచలనం అయింది. కోమటిరెడ్డి గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన రాహుల్ గాంధీ వరంగల్ సభ వైపు ఆయన కన్నెత్తి చూడలేదు. రాహుల్ గాంధీ హైదరాబాద్ ను వీడి ఢిల్లీ ప్లైట్ ఎక్కిన మరుసటి రోజే కోమటి రెడ్డి, కొండాల మధ్య ఆసక్తికర భేటీ జరిగింది. ఈ ఇద్దరు నేతల కలయికతో రకరకాల ఊహాగానాలు తెరమీదకు వచ్చాయి.

 

 

 

ఈ ఇద్దరు నేతలు త్వరలో బీజేపీ దండులో చేరిపోవడం లేదా సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించడంపైనే ప్రధానంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమకారులను కలుపుకుని టీఆర్ఎస్ ను ఎదుర్కొనేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరి భవిష్యత్ కార్యచరణ ఎలా ఉన్నప్పటికీ అసలు తెలంగాణలో ఇప్పుడున్న పార్టీలను కాదని కొత్త రాజకీయ పార్టీలకు స్పేస్ ఉందా అనేది చర్చకు వస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు, టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీతో, బీఎస్పీతో పాటు వామపక్ష పార్టీలు ప్రధానంగా ఉండేవి. స్వరాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ జనసమితి, తెలంగాణ ఇంటి పార్టీ, యువ తెలంగాణతో పాటు వైఎస్సార్ టీపీ వంటి పార్టీలు వెలిశాయి. ఇంకా చిన్నచితకా పార్టీలు ఉండనే ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో ట్రయాంగిల్ వార్ జరగబోతోందనే అంచనాలు ఉన్నాయి. ఉద్యమకారుడిగా సానుభూతి ఉన్న కోదండరామ్.. తన పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్ని అవస్థలు పడుతున్నారో తెలియనిది కాదు. ఒకానొక దశలో పార్టీని వేరే పార్టీలో విలీనం చేయబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన జిట్టా బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వెలిసిన యువ తెలంగాణ పార్టీ ఇటీవలే బీజేపీలో విలీనం చేశారు.ఈ క్రమంలో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పార్టీ పెట్టినా.. బీజేపీ, కాంగ్రెస్ ను దాడుకుని ఎంత వరసు సక్సెస్ కాగలమనేదే ఆలోచనల్లో పడేస్తోంది. ఒకవేళ టీఆర్ఎస్ కు వ్యతిరేకం అని చెప్పి పార్టీని నెలకొల్పితే అది ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లను చీల్చి తిరిగి టీఆర్ఎస్ కే లాభం చేకూర్చుతుందనేది రాజకీయ పండితుల వాదన. కాలపరిమితిని బట్టి చూస్తే రాష్ట్రంలో ఎన్నికలు రావడానికి మరో సంవత్సర కాలం ఉంది. ఆలోపు రాజకీయ సమీకరణాలు మారుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో పొలిటికల్ చదరంగంలో మరెన్ని పార్టీలు పురుడు పోసుకుంటాయో చూడాలి.

 

 

Post Midle

తాజాగా, ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో సమావేశం కావడంతో.. మరోసారి పొలిటికల్ పార్టీ రీ ఎంట్రీ చర్చ తెరపైకి వచ్చింది. అయితే, తాను ఏ పార్టీలో ఇప్పట్లో చేరను అంటూ క్లారిటీ ఇచ్చారు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టేశారు.బీజేపీ నేను అనుకున్న రీతిలో రియాక్ట్ కావడం లేదన్నారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. టీఆర్ఎస్‌పై బీజేపీ కేంద్ర నాయకత్వం ముందడుగు వేయడంలేదన్న ఆయన.. బీజేపీ రెండు అడుగులు ముందుకు వేస్తే.. మేం నాలుగు అడుగులు వేస్తామన్నారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీకి రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌ అయిన తర్వాత పరిస్థితి మారిందన్నారు. రేవంత్‌ వచ్చిన తర్వాత పార్టీ పుంజుకున్నట్టు వెల్లడించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ.. రెండు పార్టీలకు చెందిన నేతలతోనూ మాట్లాడనున్నట్టు చెప్పుకొచ్చారు. అయితే, తెలంగాణలో ఓ ప్రాంతీయ పార్టీ అవసరం ఉందన్నారు.. దాని కోసం కూడా అందరితో మాట్లాడుతున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ని ఎవరైతే కొట్టగలుగుతారు అనుకుంటే అప్పుడు ఆలోచన చేస్తామని.. అప్పటి వరకు న్యూట్రల్ గానే ఉంటానని స్పష్టం చేశారు. నిర్ణయం ఎప్పుడు తీసుకుంటాం అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేనని తెలిపారు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.

 

Tags: Discussion around Konda Vishweshwar Reddy

Post Midle
Natyam ad