ఏపీ అసెంబ్లీలో కాపు రిజర్వేషన్ బిల్లుపై చర్చ

అమరావతి ముచ్చట్లు:
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కాపులను బీసీల్లో చేర్చి సీఎం చంద్రబాబు సమస్యను సామరస్యంగా పరిష్కరించారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం ఉదయం కాపు రిజర్వేషన్ బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. మంత్రి అచ్చెన్నాయుడు బిల్లుపై చర్చను ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మద్రాసు ప్రెసిడెన్సీలోనే కాపులు బీసీల్లోనే ఉన్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాడ్డాక బీసీల లిస్టు నుంచి కాపులను తొలగించినట్లు మంత్రి గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు కాపులను బీసీలుగా చేరుస్తూ ఇచ్చిన జీవోల్లో సరైన పద్దతి లేకపోవడంతో హైకోర్టు కూడా రద్దు చేసినట్లు తెలిపారు.టీడీపీ అంటేనే సామాజిక న్యాయం అని పేర్కొన్నారు.పేదరిక నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. రావణకాష్టంలా మారిన కాపు రిజర్వేషన్ అంశాన్ని సీఎం ఓ కొలిక్కి తీసుకువచ్చారని అన్నారు. ఎన్నికల ముందు ఇదే అంశాన్ని తెరిపైకి తెచ్చి ఆ తరువాత దాన్ని పట్టించుకోకుండా అధికారం వెలగబెట్టిన ప్రభుత్వాలూ ఉన్నాయని విమర్శించారు. కాపు రిజర్వేషన్ల అంశాన్ని కొందరు రాజకీయ పబ్బం కోసం వాడుకుని అశాంతిని సృష్టించాలని చూశారని మండిపడ్డారు.కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ఎవరూ అడగలేదని, పాదయాత్రలో కాపుల కష్టాలను చూసి చలించిన చంద్రబాబు … అధికారంలోకి వస్తే కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చి దాన్ని అమలు చేశారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
Tag : Discussion on the Reservation Bill in AP Assembly


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *