పుంగనూరులో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ

పుంగనూరు ముచ్చట్లు:
 
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను 7 మంది బాధితులకు రూ.3.87 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. బుధవారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి కలసి చెక్కులు బాధిత కుటుంభాలకు అందజేశారు. అలాగే మున్సిపాలిటిలో చైర్మన్‌ అలీమ్‌బాషా, మంత్రి పిఏ మునితుకారం కలసి 5 మంది బాధితులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధితులకు సీఎం రిలీప్‌ఫండ్‌ మంజూరు చేయించారని తెలిపారు. గతంలో పరపతి ఉన్న వారికి మాత్రమే సీఎం రిలీప్‌ఫండ్‌ వచ్చేదని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి అందుతోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర, సర్పంచ్‌ శంకరప్ప , ఎంపీటీసీ నంజుడప్ప, కౌన్సిలర్లు నరసింహులు, అమ్ము, జేపి.యాదవ్‌, నటరాజ , పార్టీ నాయకులు చంద్రారెడ్డి యాదవ్‌, రెడ్డెప్ప, నవీన్‌కుమార్‌రాజు, గౌస్‌, రమణ, గంగాధర్‌, ఖాదర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

Tags: Distribution of Chief Minister’s Assistance Fund checks at Punganur

Natyam ad