Distribution of food to farmers

రైతులకు ఉలవలు పంపిణీ

Date:18/09/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలంలో వర్షాభావంతో పంటలు నష్టపోయిన రైతులందరికి ఉచితంగా ఉలవలు పంపిణీ కార్యక్రమాన్ని ఏవో జ్యోతమ్మ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు.

 

ఈ కార్యక్రమానికి ఎంపిపి నరసింహులు, వైస్‌ ఎంపిపి రామచంద్రారెడ్డి, జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌ హాజరై పంపిణీ ప్రారంభించారు. మండలంలోని రైతులకు 700 క్వింటాళ్లు పంపిణీ చేయనున్నట్లు ఎంపిపి తెలిపారు.

 

ఇందులో భాగంగా 200 క్వింటాళ్లు మాత్రమే సరఫరా జరిగిందని ఆయన తెలిపారు. 10 కేజిల ఉలవలు ఉచితంగా రైతులకు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అగ్రీకల్చర్‌ కార్యాలయం వద్ద, మార్కెట్‌ యార్డులోను రైతులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. సరుకు లేకపోవడంతో రైతులు ఘర్షణలకు దిగారు.

మూడు నెలలనుంచే స్కెచ్ 

Tags: Distribution of food to farmers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *