కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
వలిగొండ ముచ్చట్లు:
పేద ప్రజల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని మన ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణలక్ష్మీ మరియు షాదీ ముబారక్ పథకం కింద ఈ రోజు 133 కళ్యాణలక్ష్మీ చెక్కులను చెక్కులతో పాటు ఆడపడుచు లాంఛనంగా మన ఎమ్మెల్యే సొంత డబ్బుతో పోచంపల్లి పట్టు చీర ధోతి టవల్ ని లబ్ధిదారులకు అందజేసారు. పేద ప్రజలకు దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిదంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందని, పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి పథకం ఒక వరం అని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జడ్పిటిసి సర్పంచ్ లు ప్రజలు పాల్గొన్నారు.
Tags: Distribution of Kalyana Lakshmi checks