పుంగనూరులో కార్మికులకు మాస్క్ లు  , శానిటైజర్లు పంపిణీ

పుంగనూరు ముచ్చట్లు:
 
పట్టణంలోని మున్సిపల్‌ కార్మికులకు మాస్క్ లు , శానిటైజర్లు, సోపులను ఎస్సీ, ఎస్టీ మానటరింగ్‌ కమిటి సభ్యులు పంపిణీ చేశారు. శుక్రవారం మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా ఆధ్వర్యంలో కమిటి సభ్యులు ఎన్‌ఆర్‌.అశోక్‌, రాజా కలసి  మాస్క్ లు పంపిణీ చేశారు. చైర్మన్‌ మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికులు ప్రతి రోజు తమ ప్రాణాలను పణంగా పెట్టి, ప్రజల ఆరోగ్యం కోసం శ్రమిస్తున్నారని కొనియాడారు. అలాంటి కార్మికులు ఆరోగ్యవంతులుగా ఉండేందుకు ఎస్సీ, ఎస్టీ కమిటి సభ్యులు ముందుకురావడం అభినందనీయమన్నారు. కార్మికుల సంక్షేమాన్ని కాంక్షించేవారు తగిన రీతిలో సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సురేంద్రబాబు, దళిత నాయకులు శ్రీనివాసులు, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

Tags; Distribution of masks and sanitizers to workers in Punganur
 

Natyam ad