కొత్త వాలంటీర్లకు నియామక పత్రాలు అందజేత

కొడవలూరు ముచ్చట్లు:
కొడవలూరు మండలంలో సచివాలయాల్లో నూతనంగా నియమించబడిన వాలంటీర్లకు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిచేతులు మీదగా నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయటంలో వాలంటీర్లు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని చెప్పారు.ప్రతి నెల ఒకటవ తేదీన పింఛన్లను లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి అందిస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ పారదర్శక పాలనకు ఇదొక నిదర్శనమని అన్నారు.వాలంటీర్లు సేవా దృక్పథంతో సేవలు అందించబట్టే సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు అందుతున్నాయని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో   డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతి రావు  , బుచ్చి ఛైర్పర్సన్ మోర్ల సుప్రజ , ఎంపీడీఓ, మండల అధ్యక్షుడు గంధం వెంకట శేషయ్య మరియు స్థానిక నాయకులు సచివాలయ సిబ్బంది వలింటర్ల‌‌లు తదితరులు పాల్గొన్నారు.
 
Tags: Distribution of recruitment documents to new volunteers

Natyam ad