పుంగనూరులో విద్యార్థులకు దుస్తులు పంపిణీ
పుంగనూరు ముచ్చట్లు:
గూడూరుపల్లి , జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రతి విద్యాసంవత్సరం పదవతరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు తన సొంత డబ్బులతో విలువైన బట్టలను దాత తెలుగుభాషా బోధకులు జి వి రమణ అంద చేస్తున్నారని , తమ పాఠశాల విద్యార్థులు మండలంలో అత్యధిక మార్కులు సాధించాలనే ఉద్దేశ్యంతో గ్రామాలకు నైట్ విజన్ వెళ్లి పిల్లలు ఎలా చదువుతున్నారో రాత్రుల్లో పర్యవేక్షిస్తారని గతంలో అత్యధిక మార్కులు సాధించి త్రిబుల్ ఐటీలో చదువుచున్న విద్యార్థులు భార్గవి,రెడ్డమ్మలకు ఈ ఏడాది దాదాపు 5,000 రూపాయలు విలువ కలిగిన బట్టలను తన ద్వారా అందివ్వడం సంతోషమని ప్రధానోపాధ్యాయులు మహేష్ నారాయణ ప్రశంసించడమైనది.గ్రామస్తులు రాజశేఖర్ రెడ్డి, ప్రశాంత్ ,యశ్వంత్, రామోజీ మాట్లాడుతూ జీవి రమణ సేవలు ఆదర్శం అమోఘమని కొనియాడిరి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రఘు, అమర్నాథ్, శైలజ, రాజేష్ ,శారద, విజయవాణి, మునిరాజ, నారాయణ, సురేష్ రెడ్డి, ప్రకాష్ రావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags: Distribution of uniforms to students in Punganur