సమాచార శాఖ మీడియా సెంటర్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కృష్ణఅదిత్య

ములుగు ముచ్చట్లు:
మేడారం సమ్మక్క – సారలమ్మ జాతరను పురస్కరించుకొని సమాచార పౌరసంబంధాల శాఖ అద్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ ను బుదవారం ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ అదిత్య ప్రారంభించారు.  ఈ సందర్బంగా  కలెక్టర్ మాట్లాడుతూ, జాతర కవరేజి నిమిత్తం వచ్చిన ప్రింట్ ఆండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయలకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సహాయ సంచాలకులు బి. లక్ష్మణ్ ను ఆదేశించారు.  ఇంటర్ నెంట్, భోజనం వసతుల కల్పనలో కూడా పాత్రికేయలు ఇబ్బందులు పడకుండా చూడాలని సూచించారు.  అనంతరం మీడియా సెంటర్ లో ఏర్పాటు చేసిన కంప్యూటర్ లను, వంటగదిని పరిశీలించారు.  అన్ని ఏర్పాట్లను చూసి సమాచార శాఖ అధికారులందరిని, సిబ్బందిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసంబంధాల అధికారులు భూపాలపల్లి, వరంగల్ సిరిసిల రాజన్న డిపిఆర్ఓ లు బి.రవి కుమార్, బండి పల్లవి, యం ఏ గౌస్,ఎఆర్ఇ  పి. భూపాల్, ములుగు డివిజనల్ పిఆర్ఓ  బి. ప్రేమలత, ఏవిఎస్  కె.రామ చంద్రరాజు, ఏపిఆర్ఓ   యం.డి. రఫీక్  ఇతర సిబ్బంది పాల్గోన్నారు.
 
Tags: District Collector Krishna Aditya inaugurated the Information Media Center

Natyam ad