సూదికొండలో జిల్లా అటవీ శాఖ అధికారి పర్యటన, కొత్తగా వేసిన ప్లాంటేషన్స్ పరిశీలన.

గోకవరం ముచ్చట్లు:
గోకవరం మండలం సూదికొండ అటవీప్రాంతంలో జిల్లా అటవీశాఖ అధికారి ఐకేవి రాజు పర్యటించారని సూదికొండ రేంజ్ అధికారి కరుణాకర్ తెలిపారు.. సూదికొండ అటవీప్రాంతంలో శిక్షణ పొందుతున్న ఉద్యోగుల తో మాట్లాడి, వారికి విలువైన సూచనలు, సలహాలు ఇచ్చినట్లు తెలిపారు.. అటవీప్రాంతంలో ఏ విధంగా తిరగాలి, ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టాలి అనే విషయాలను వివరించినట్లు చెప్పారు.. అలాగే గొరగిమ్మి ప్రాంతంలో వేసిన ప్లాంటేషన్స్ ని పరిశీలించారని, క్షీణించిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు వేయాలని సూచించినట్లు తెలిపారు.. అటవీప్రాంతంలో ఎక్కడైనా మొక్కలు క్షీణిస్తే ఆ ప్రాంతంలో మళ్ళీ మొక్కలు అభివృద్ధి చేయాలన్నారు.. ఈ కార్యక్రమంలో సూదికొండ అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు..
 
Tags:District Forest Officer visits Soodikonda and inspects newly laid plantations

Natyam ad