ప్రజా చైతన్యంతోనే డెంగ్యూ నివారణ-జిల్లా వైద్యాధికారి డాక్టర్. పుప్పాల శ్రీధర్

జగిత్యాల  ముచ్చట్లు:

ప్రజా చైతన్యంతోనే డెంగ్యూ వ్యాధిని నివరించావచ్చనని జగిత్యాల జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి పుప్పాల శ్రీధర్ అన్నారు.
సోమవారం జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని మోతేవాడ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి నిర్వహించిన అవగాహన ర్యాలీని జగిత్యాల జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్ ప్రారంభించారు. ఈ సంధర్బంగా
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి శ్రీధర్ మాట్లాడుతూ తెలంగాణ ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఆద్వర్యంలో మే 16 జాతీయ డెంగ్యూ దినోత్సవం పురస్కరించుకొని డెంగ్యూ జ్వరం పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. నివారణ చర్యలను పెంచడంతో పాటు జిల్లా వ్యాప్తంగా వ్యాధిని నివారించడానికి, నియంత్రించడానికి మార్గాలను కనుగొనడం దీని ముఖ్య ఉద్దేశ్యమన్నారు.డెంగ్యూ వ్యాధి ప్రమాదకరమైందని,ఈ వ్యాధి దోమల ద్వారా ప్రబలుతుందని,ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందన్నారు.నివాస పరిసరాల్లో అనవసర నీటి నిల్వలు ఉండడం, పారిశుధ్యం లోపించడం వల్ల దోమలు వృద్ధి చెంది డెంగ్యూ వ్యాధికి కారణమవుతుందన్నారు.గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుధ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని జిల్లా వైద్య  ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుప్పాల శ్రీధర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి డా. ముస్కు జైపాల్ రెడ్డి,వైద్యులు,ఏఎన్ఏం లు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: District Medical Officer Dr. Puppala Sridhar