జిల్లా సాధనా సమితి వినూత్న నిరసన..

మార్కాపురం ముచ్చట్లు:
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం గ్రామంలో మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.జేఏసీ చైర్మన్ మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి,కనిగిరి మాజీ శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో రోడ్లు ఊడ్చుతూ నిరసన తెలిపారు.ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ మరియు మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లాలో వెనుకబడిన పశ్చిమ ప్రకాశం ఐదు నియోజకవర్గాలను మార్కాపురం జిల్లాగా ప్రకటించాలని ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్బంగా కనిగిరి మాజీ శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి మాట్లాడుతూ.. కనిగిరి నియోజకవర్గంలో కూడా మార్కాపురం జిల్లా ఉద్యమాన్ని గ్రామగ్రామాన విస్తరిస్తామని తెలియజేశారు.
 
Tags:District Sadhana Samithi Innovative Protest

Natyam ad