దివానే సాహెబ్ నేడు గంధం-రేపు ఉరుసు.
బద్వేలు ముచ్చట్లు:
రాయచోటి పట్టణంలోని బండ్ల పెంట లో వెలిసిన హజరత్ సయ్యద్ యూసుఫ్ షా ఖాదరి ఖుతుబ్ ఉరఫ్ ‘దివానే సాహెబ్’నేడు శుక్రవారం గంధము,రేపు శనివారం ఉరుసు. రెండు రోజులపాటు ఉరుసు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు దర్గా కమిటీ కార్యనిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉత్సవాలలో మహారాష్ట్రకు చెందిన గొప్ప సంగీత ఖవ్వాలి కళాకారులు అజీమ్ నాజా, పర్వీన్ రంగీలీ ఇద్దరి టీవీ సింగర్ల మధ్యన సంగీత, సాహిత్య, ఆధ్యాత్మిక ఖవ్వాలి పోటీ దివానే సాహెబ్ భక్తులకు కన్నుల పండుగగా ఉంటుందని వారు చెప్పారు. గంధం రోజుఉచిత అన్నదానం, మహిళలకు ప్రత్యేక గ్యాలరీ తోపాటుఅన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలియజేశారు. ఈ ఉరుసు
ఉత్సవాలను హిందూ, ముస్లిం సోదరులు అందరూ కలిసి మెలసివిజయవంతం చేయాలని వారు పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేశారు.
Tags:Diwane Saheb sandalwood today-tomorrow urusu