పుంగనూరులో వీధి బాలలను నిర్లక్ష్యం చేయకండి – న్యాయమూర్తి సిందు
పుంగనూరు ముచ్చట్లు:
సమాజంలో వీధి బాలలను నిర్లక్ష్యం చేయకుండ వారికి ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల పథకాలను అందించి, వారి హక్కులను కాపాడాలని పట్టణ అడిషినల్ జూనియర్ సివిల్‌జడ్జి సిందు కోరారు. సోమవారం అంతర్జాతీయ వీధి బాలల దినోత్సవాన్ని స్థానిక బసవరాజ హైస్కూల్లో నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ వీధి బాలల కోసం ప్రభుత్వం సంక్షేమ పాఠశాలలు ఏర్పాటు చేసిందన్నారు. వీధి బాలలను గుర్తించి వారిని హస్టల్‌కు తరలించాలన్నారు. ముఖ్యంగా పిల్లలు మోటారువాహనాల చట్టం, విద్యాచట్టం, బాల్యవివాహాల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. పిల్లలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా మండల్లీగల్ సర్వీసస్ అథారిటికి ఫిర్యాదు చేయాలన్నారు. దీని ద్వారా పిల్లల హక్కులను పరిరక్షించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు వీరమోహన్ రెడ్డి, ఎస్ఐ మోహన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గుండెపోటుతో నిరుద్యోగి మృతి
Tags; Do not neglect street children in Punganur – Judge Sindhu