ఆరోగ్యానికి పేదరికానికి ముడి పెట్టవద్దు.

-ప్రజల వైద్య సేవలపై ప్రభుత్వాల వైఖరి మారాలి.
-లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ
హైదరాబాద్ ముచ్చట్లు:
 
నాణ్యమైన విద్య మంచి ప్రమాణాలతో కూడిన వైద్యం ప్రజలకు అందించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, అఖిల పక్ష సమావేశంలో పలువురు నేతలు ముక్తకంఠంతో నినదించారు. లోక్ సత్తా పార్టీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అందరికీ వైద్య సేవలు హక్కు అనే దానిపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ అఖిలపక్ష సమావేశంలో సిపిఐ నాయకులు పశ్య పద్మ, సిపిఎం నాయకులు పివి నరసింహారావు, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఇందిరా శోభన్, టిడిపి ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న, జనసేన ప్రతినిధి రాజలింగం, ప్రజా ప్రతినిధులు కోటేశ్వరరావు, సత్యనారాయణ, భవాని శ్రీనివాసు, మారుతీ రావు తదితరులు పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్బంగా జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ  పేద ప్రజల బ్రతుకులు చేస్తున్న ప్రభుత్వం మార్చుకోవాలని మంచి ప్రమాణాలు వైద్యం విద్య అందించాలని ఆయన డిమాండ్ చేశారు ఆరోగ్యానికి పేదరికానికి ముడి పెట్టకుండా అందరికీ వైద్యం హక్కు అనే దాన్ని అందించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ప్రధాన రాజకీయ పార్టీలు స్థాయిలను పక్కాగా అమలు చేస్తున్నాయి ప్రజల జీవన ప్రమాణాలను పెంచే మంచి విద్య కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. ఉచిత విద్య ఆరోగ్యం పెరుగుట పేద పేలవమైన సేవలు కాకుండా నాణ్యమైన ప్రమాణాలతో కూడిన ఆరోగ్యాన్ని ప్రజల హక్కు అందించారన్నారు లోక్ సత్తా  ప్రతిపాదించిన అందరికీ ఆరోగ్యం బలపరిచి, దాని అమలుకు ప్రభుత్వాలపై లోక్ సత్తా  చేపట్టనున్న ఉద్యమానికి వారు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సత్తా పార్టీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల పల్లి శ్రీనివాసు మాట్లాడుతూ అనారోగ్యానికి గురైతే తమ కర్మని వదిలేయకుండా ఆరోగ్యం హక్కుగా సాధించుకోవాలని దీనికి ప్రజాస్వామ్య పంథాలో ఉద్యమాన్ని నిర్మించి పార్టీలను ప్రజా సంఘాలను మేధావులను యువతను మహిళను చైతన్యం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో లోక్ సత్తా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నందిపేట రవీందర్ కార్యదర్శి సరోజాదేవి రామచంద్రుడు రంగాచారి మేకల నరసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags:Do not tie health to poverty.

Natyam ad