తిరుమలలో మహిళా ఎమ్మెల్యేను అవమానిస్తారా..? – టీటీడీ అధికారులపై రోజా ఫైర్‌

తిరుమల ముచ్చట్లు:

ప్రపంచ ప్రసిద్దిగాంచిన తిరుమల-తిరుపతి దేవస్థానంలో అధికారుల అక్రమాలపై వైఎస్సాఆర్సీపి నగిరి ఎమ్మెల్యే ఆర్‌కె.రోజా విరుచుకుపడ్డారు. ఆమె తిరుమల దర్శనానికి పాదయాత్ర చేసి వచ్చారు. ఈ సందర్భంగా ఎల్‌-1 టికెట్లు కేటాయించాలని కోరారు. దీనిపై అధికారులు ఎల్‌-1 కేటాయించకపోవడంతో ఆమె అగ్రహం వ్యక్తం చేశారు. 8 నెలలుగా పాలకమండలి లేకపోవడంతో జెఈవో శ్రీనివాసరాజు తిరుమల దేవస్థానాన్ని వ్యాపార కేంద్రంగా మార్చి, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మహిళా శాసనసభ్యురాలైన తనను, తన పార్టీ ప్రతినిధులను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, జెఈవో శ్రీనివాసరాజుపై ఆమె ఆరోపణలు చేశారు. ఈ విషయమై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tag : Do you insult the woman MLA in Tirumala? – Roja Fire on TTD officers


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *