డాక్టర్‌ ఆఫ్‌ ఫార్మసి నిరుద్యోగుల గోడు పట్టించుకోరా…?

-70 కళాశాలలో విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్థకం

-21 వేల మంది భవిష్యత్తుకు బరోసా ఎక్కడా…?

Date: 03/01/2018

పుంగనూరు ముచ్చట్లు:

డాక్టర్‌ ఆఫ్‌ ఫార్మసి విద్యార్థుల గోడు పట్టించుకోక పోవడంతో సుమారు 300 మంది విద్యార్థులు వీధిన పడ్డారు. సమస్యల సాధన కోసం తిరుపతిలో సంఘ నేతలు హరికృష్ణ, రాజశేఖర్‌ అధ్వర్యంలో నిరాహారదీక్షలు చేపట్టిన ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో ఆందోళన తీవ్రతరం కానుంది. భారత దేశంలో 2008 సంవత్సరంలో డాక్టర్‌ ఆఫ్‌ ఫార్మసి అనే ఆరు సంవత్సరాల కోర్సును ప్రారంభించారు. దేశం వెహోత్తం 25 కళాశాలలో ఈ విద్యను ప్రారంభించారు. ఈ కళాశాల ఏర్పాటు కోసం 233 మందికి అనుమతి లభించింది. ఆంధ్రలో 70 కళాశాలలో ఈ కోర్సు నిర్వహిస్తున్నారు. 2014 నుండి ఇప్పటి వరకు 3వేల మంది కోర్సులు పూర్తి చెసిన ఉద్యోగ అవకాశాలు లభించలేదు. ప్రస్తుతం 21వేల మంది విద్యార్థులు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగ వీదిన పడ్డారు. ఇలాంటి పరిస్థితిలో 2008 నుంచి లక్షలాది రూపాయలు ఖర్చు చేసి కోర్సు పూర్తి చెసిన ఉద్యోగ అవకాశాలు లభించకపోవడంతో డాక్టర్‌ ఆఫ్‌ ఫార్మసి నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు.

క్లినికల్‌ ఫార్మసిస్ట్ కేడర్‌ను ఆసుపత్రిలో ఏర్పాటు చెయాలి-

క్లినికల్‌ ఫార్మసిస్ట్ కేడర్‌ను ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలోను ఏర్పాటు చేసి తప్పనిసరిగ ఫార్మడీలను క్లినికల్‌ ఫార్మసిస్టులుగ నియమించాలని సంఘ నాయకులు హరికృష్ణ, రాజశేఖర్‌లు డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించినట్లు తెలిపారు. దీనిపై ప్రభుత్వం స్పందిస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.

Tags: Doctor of pharmacy care for the unemployed of the unemployed ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *