విక్రమ సింహపురి యూనివర్సిటీ అభివృద్ధికి దాతలు సహకారం అందించాలి.

-వి ఎస్ యు వైస్ ఛాన్సలర్ ఆచార్య సుందరవల్లి
నెల్లూరు ముచ్చట్లు:
నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలం కాకుటూరు గ్రామంలో ఉన్న విక్రమ సింహపురి యూనివర్సిటీ అభివృద్ధికి సింహపురి దాతలు సహకారం అందించాల్సిన అవసరం ఉందని వి ఎస్ యు వైస్ ఛాన్స్లర్ ఆచార్య సుందరవల్లి పిలుపునిచ్చారు.  విక్రమ సింహపురి యూనివర్శిటీకి నేషనల్ అసెస్ మెంట్, అక్రిడిటేషన్ కౌన్సిల్ ( న్యాక్ ) గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు యూనివర్శిటీ వైస్ – ఛాన్సలర్ జి.ఎం. సుందరవల్లి పేర్కొన్నారు. ఆ దిశగా యూనివర్శిటీలో మౌలిక వసతులను పెంపొందిస్తున్నామని తెలిపారు . నెల్లూరు నగరం లోని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం లో ప్రస్తుతం ఉన్న వస్తువుల కంటే ఆధునిక వసతులు కల్పించాలన్న, ఆగిపోయిన భావన నిర్మాణాలు పూర్తి కావాలన్న దాతల సహకారం అవసరం ఉందన్నారు . పూర్తిగా ప్రభుత్వ నిధులతో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం అభివృద్ధి సాధించాలంటే అసాధ్యమన్నారు. ఈ క్రమంలో జిల్లాలోని దాతలు ముందుకొస్తే విక్రమ సింహపురి విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి ప్రధాన నడిపేందుకు అవకాశముందన్నారు. జిల్లాకు తలమానికంగా యూనివర్సిటీని రూపుదిద్దుకుని , మౌళిక వసతుల కల్పన జరగాలంటే దాతల సహకారం అవసరం ఉందన్నారు. యూనివర్సిటీలో హెల్త్ సెంటర్, అంబులెన్స్, కాన్ఫరెన్స్ హాల్, ఆడిటోరియం తదితర వసతులు కల్పించాల్సి ఉందన్నారు. సహకరించిన దాతల  పేర్లను ఆయా భవనాలకు పెట్టుకోవచ్చని చెప్పారు. విద్యా ప్రమాణాల పెంపు, సమాజానికి ఉప యుక్తమైన పరిశోధనలతో విక్రమ సింహపురి యూనివర్శిటీకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. న్యాక్ సర్టిఫికేషన్ కోసం యూనివర్శిటీని సిద్దం చేస్తున్నామని వైస్ – ఛాన్సలర్ సుందరవల్లి తెలిపారు. న్యాక్ గుర్తింపు కోసం దానికి సమర్పించాల్సిన వివిధ అంశాల కోసం కమిటీలను ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా తెలియ జేశారు.యూనివర్శిటీ స్నాతకోత్సవాన్ని ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నెలల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
త్వరలోనే గవర్నర్ ను కలిసి తేదీలను ఖరారు చేస్తామని చెప్పారు. ఈనెల 28వ తేదీనా యూనివర్శిటీలో జాతీయ సైన్స్ డే ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామని, ఆ ఈ కార్యక్రమానికి షార్ డైరెక్టర్ ఏ. రాజరాజన్ ముఖ్య అతిధిగా హాజరవుతారని వెల్లడించారు. అలాగే యూనివర్శిటీలో పూర్వ విద్యార్ధుల సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నామని , దానికి సంభందించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అన్నారు. యూనివర్శిటీ అభివృద్ధికి పూర్వ విద్యార్ధుల సహకారం తీసుకుంటామని సుందరవల్లి పేర్కొన్నారు. ఈ సమావేశంలో  ఆచార్య ఎం .చంద్రయ్య, రిజిస్టర్ డాక్టర్ ఎల్ వి కృష్ణారెడ్డి  తదితరులు పాల్గొన్నారు.
 
Tags:Donors should contribute to the development of Vikrama Sinhapuri University.

Natyam ad