రాజ్యాంగాన్ని ముట్టుకోని చూడు… బొక్కలు చూర చూర అయితయ్..

సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలనతం సిగ్గు చేటు
ఈ మూర్ఖుడు సీఎం ఎట్లా అయ్యాడో!
ఆయనకు రాజ్యాంగం వల్ల వచ్చిన ఇబ్బంది ఏమొచ్చింది
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్
 
 
న్యూ ఢిల్లీ  ముచ్చట్లు:
 
రాజ్యాంగాన్ని మార్చాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా నిరసిస్తూ ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్దనున్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్.పాలాభిషేకం చేసారు. నిజామబాబాద్, ఆదిలాబాద్ ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాబూరావు, పార్టీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాల సుబ్రమణ్యం, కేంద్ర జల వనరుల విభాగం సలహాదారు వెదిరె శ్రీరాం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ సిగ్గు లేకుండా, సోయి లేకుండా మాట్లాడుతున్నరు.ఈ మూర్ఖుడు సీఎం ఎట్లా అయ్యాడో దేశం ప్రశ్నిస్తోందన్నారు. తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునే దుస్థితి అన్నారు. బిడ్డా… రాజ్యాంగాన్ని ముట్టుకోని చూడు… బొక్కలు చూర చూర అయితయ్..• నీకు రాజ్యాంగం వల్ల వచ్చిన ఇబ్బంది ఏమొచ్చింది కేసీఆర్..?
 
 
• ప్రపంచమంతా భారత రాజ్యాంగాన్ని చూసి ప్రశంసిస్తోంది. గొప్ప ప్రజాస్వామ్యాన్ని అందించిన ఘనత అంబేద్కర్ రాజ్యాంగానిదే నన్నారు. బడ్జెట్ పై అభ్యంతరాలు చెబితే ఇబ్బందేమీ లేదు… కానీ బూతులు మాట్లాడటం సిగ్గు చేటు.. దళితులంటే నీకెందుకు చులకన? అంబేద్కర్ జయంతి, వర్దంతి కార్యక్రమాలకు ఎందుకు హాజరు కావు? అని ప్రశ్నించారు. దేశంలోని ప్రతి సీఎం అంబేద్కర్ జయంతి, వర్దంతి కార్యక్రమాలకు హాజరుకావడం సాంప్రదాయమని, అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్టించడం లేదు?, దళితుడిని సీఎం చేస్తానని మాట తప్పడానికి కారణం… కేసీఆర్ కు దళితులపై ఉన్న ద్వేషం, కసి కారణమా?అని ప్రశ్నించారు. దళిత డిప్యూటీ సీఎంను బర్తరఫ్ చేయించిన ఘనత కేసీఆర్ కే దక్కుతోందన్నారు. దళిత బంధు ఎంతమందికి ఇచ్చినవో చెప్పే దమ్ముందా? కేసీఆర్… నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు… రాజ్యాంగాన్ని ముట్టుకొని చూడు.. మసి అయిపోతావ్… కేసీఆర్ కు కళ్లు నెత్తికెక్కినయ్.. అహంకారం పెరిగింది.ఇలాంటి మూర్ఖపు సీఎం ఇంకా కొనసాగడం ఎంత వరకు న్యాయమో తెలంగాణ సమాజం ఆలోచించాలన్నారు. ఇదంతా ఓ కుట్రలో భాగమే… దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తందని దుష్ప్చ్రచారం చేశారన్నారు. బీజేపీ ఏమైనా రాజ్యంగాన్ని మార్చిందా? పంచ తీర్థాల స్పూర్తి అంబేద్కర్ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుతున్న పార్టీ బీజేపీ, మహనీయుడు నరేంద్రమోదీ అన్నారు. రాష్ఠ్రపతి కోవింద్ దళితుడు కాబట్టే పార్లమెంట్ లో ఆయన ప్రసంగాన్ని టీఆర్ఎస్ నేతలు బహిష్కరించారన్నారు. కేసీఆర్… నీకు ఏ మాత్రం ఇంగిత జ్ఝానం ఉంటే వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని బండి డిమాండ్ చేసారు. లేకుంటే నువ్వు మనిషివి కూడా కాదని తెలంగాణ సమాజం ఛీత్కరించడం ఖాయం. రేపు ఉదయం 11 గంటలకు సీఎం వ్యాఖ్యలకు నిరసనగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర నేతలు దీక్ష చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాల్సిన కార్యాచరణపైనా సాయంత్రంలోపు ప్రకటిస్తాం మన్నారు. కాంగ్రెస్ నేతలు… అంబేద్కర్ ను అవమానించిన కేసీఆర్ తరపున వకాల్తా పుచ్చుకోవడం సిగ్గు చేటన్నారు.
 
 
 
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మిగిలేది 5 సీట్లు మాత్రమేనని, అవినీతి సొమ్ముతో రూ.500 కోట్లు పెట్టి స్ట్రాటజీ టీంను పెట్టుకున్న కేసీఆర్ ను జైలుకు పంపడం ఖాయం మన్నారు.కేసీఆర్ ను జైలుకు పంపి తొక్కడం ఖాయం… ఈ విషయం తెలిసే తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టేందుకు కేసీఆర్ కుట్ర చేస్తుండు.. తెలంగాణకు అన్యాయం జరిగితే ఏడేళ్లుగా ప్రధానిని కలిసి ఎందుకు చెప్పలేదన్నారు. తనను తాను, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికే కేసీఆర్ ఈ జిమ్మిక్కులు చేస్తున్నారన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై అన్ని పార్టీలు స్పందించాలని, రాజ్యంగం విషయంలో కేసీఆర్ చేసిన నీచపు, విషపు వ్యాఖ్యలకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఉద్యమించాలని కోరారు.
 
Tags; Don’t touch the constitution …

Natyam ad