రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పాతబస్టాండ్ వద్ద తాగునీటి సౌకర్యం..

డోన్  ముచ్చట్లు: 
రోటరీ క్లబ్ మరియు పురపాలక సంఘం ఆధ్వర్యంలో పాతబస్టాండ్ వద్ద తాగునీటి సౌకర్యం కల్పించడం జరిగింది, స్థానిక పాతబస్టాండ్  గాంధీ సర్కిల్ లో రాజయ్య గౌడ్ మరియు వారి ధర్మపత్నీ మద్దమ్మ ఆర్థిక సహాయం తో చల్లటి నీటి వసతి సౌకర్యాలు కల్పించారు,ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్, మునిసిపల్ కమిషనర్ కె ఎల్ ఎన్ రెడ్డి హాజరై ఈ
చల్లటినీటి కార్యక్రమం  ప్రారంభించారు,  వారు మాట్లాడుతూ ఎంతో మంది ప్రజలు పల్లెల్లో నుంచి పట్టణానికి వస్తూ ఉంటారు, ఎండాకాలం లో దాహార్తిని తీరే విధంగా వారికి చల్లనీటి సౌకర్యం కల్పించాలని ఆలోచన రోటరీ క్లబ్ వారికి రావడం గొప్పా విషయం అని రోటరీ క్లబ్ అధ్యక్షుడు జింకల కృష్ణ ను కార్యదర్శి శేఖర్ యాదవ్ ను అభినందించడం జరిగింది, దాతలకు కృతజ్ఞతలు
తెలిపారు,ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు విజయకుమార్, కృష్ణ కిషోర్,రామాంజనేయులు ఆచారి జగన్మోహన్,  సత్యసేన రెడ్డి,లక్ష్మిరెడ్డి,శంకర్ గౌడ్,నాగరాజు, ఏ సి పుల్లారెడ్డి, బుగ్గారెడ్డి,కౌన్సిలర్ మల్లికార్జున రెడ్డి,ఇన్నర్ వీల్ సభ్యులు మద్దమ్మ, శైలజ,శారదా దేవి, తదితరులు పాల్గొన్నారు.
 
Tags:Drinking water facility at Patabstand under the auspices of the Rotary Club

Natyam ad