అనంతలో తాగు నీటి ఎద్దడి

Date:20/02/2018
అనంతపురం ముచ్చట్లు:
అనంతపురం జిల్లాలో కరవుకు పెట్టింది పేరు. ఏడాదంతా కరవు కాటకాలతో అల్లాడుతుంది. ఇక వేసవి వస్తుందంటే చెప్పనక్కర్లేదు. తాగునీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని రుద్రంపేట పంచాయితీలో తాగునీటి సమస్య అధికమైంది. పంచాయితీ పరిధిలో 24బోర్లు వుంటే, వాటిలో పద్దెనిమిది బోర్లు ఎండిపోగా, కేవలం ఆరు బోర్లు మాత్రమే పనిచేస్తున్నాయి. ప్రభుత్వం 1.25కోట్ల రూపాయలతో వాటర్ సంపును ఆగమేఘాల మీద నిర్మిస్తోంది. అయితే ఇప్పట్లో ఈ సంపు అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు. ఇక చేసేదేమీ లేక ప్రైవేట్ ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నారు. ఆ నీరు తమకు చాలడం లేదంటూ అధికారులకు ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు.పంచాయితీ పరిదిలోని చంద్రబాబు నగర్,రుద్రంపేట,అజయ్ ఘోష్ కాలనీ, మదర్ థెరిసా కాలనీ లాంటి శివారుప్రాంతాలు అనేకం ఉన్నాయి. ఈ కాలనీల్లో నివసించే ప్రజలు ఉదయం కూలీపనికి వెళ్లి సాయంత్రం ఇళ్లకు చేరుకుంటారు. ప్రజలు ఇళ్ల దగ్గర ఉన్నప్పుడే నీటిని సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి శివారు పంచాయతీలకు పిఏబిఆర్ నీటిని అందించకపోతే మిగిలిన పంచాయతీలైన నారాయణపురం,కక్కలపల్లి కాలనీ,ఆకుతోటపల్లి,అనంతపురం రూరల్‌లో రోజురోజకు పరిస్థితి దిగజారిపోయే అవకాశాలున్నాయి. ఈ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తెలిపారు. తక్షణమే నీటి సమస్యను పరిష్కరించాలని లేదంటే రానున్న వేసవి కాలంలో చుక్క నీరు కూడా దొరకదని ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు .
Tags: Drinking water in infinity

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *