మర్రివలస గ్రామంలో త్రాగు నీటి సమస్య

  • ఖాళీ బిందెలతో మహిళలు నిరసన, జనసేన మాజీ ఎంపిటిసి, సాయిబాబా, అల్లంగి రామకృష్ణ

విశాఖపట్నం: అరకువేలి మండలం చొంపి పంచాయతీ పరిధిలో గల మర్రి వలస గ్రామంలో మంచి నీరు సమస్య తీవ్రంగా ఉండడంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సుమారు 30 గడపలు ఉన్న ఈ గ్రామంలో 120 మంది వరకు జనాభా కలిగి ఉన్నారు కొల్లాయి మరమ్మతులు చేపట్టి గిరిజనులకు మంచినీటి సౌకర్యం కల్పించాలని సోమవారం ఉదయం జనసేన పార్టీ ఎక్స్ ఎంపీటీసీ సాయిబాబా దురియా, అల్లంగి రామకృష్ణ, పొద్దు, అర్జున్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.అనంతరం గ్రామస్తులతో సమావేశమై ప్రభుత్వం తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వానికి తెలిసేలా ఖాళీ బిందెలతో మహిళలు నినాదాలతో నిరసన తెలిపారు,

ఈ సందర్భంగా జనసేన ఎక్స్ ఎం పి టి సి సాయి బాబా, రామకృష్ణ, అర్జున్ తదితరులు మాట్లాడుతూ మర్రివలస గ్రామంలో నెలకొన్న కొలాయి మరమ్మతు చేపట్టి మంచి నీరు సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో జన సైనికులు, గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు.

Natyam ad