తాగునీటి కట..కట

Date:14/02/2018
ఖమ్మం ముచ్చట్లు:
మండల పరిధిలోని ఉప్పాక పంచాయతీ బందగిరి నగరంలో తాగునీటి కటకటతో గ్రామస్తులు అలమటిస్తున్నారు. మారేడుగూడెం నుంచి ఇటీవలే నూతన పైపు లైను వేశారు. కానీ ఆ పైపు నీరు మూనాళ్ల ముచ్చటే అన్న చందంగా తయారైంది. నారాయణపురం గ్రామ సమీపంలోని పొలాల్లో పైపు లైను లీకవడంతో బందగిరి నగరానికి తాగునీటికి కటకట ఏర్పడింది. గ్రామంలో చేతి పంపులు సైతం పాడయ్యాయి. దీంతో గ్రామస్తులకు సమీప బావులే దిక్కయ్యాయి. అవి కూడా అపరిశుభ్రంగా ఉన్నప్పటికీ దిక్కుతోచని పరిస్థితిలో ప్రజలు తమ అవసరాలకు ఉపయోగిస్తున్నారు. మరికొందరైతే చెరువు సమీపంలో చెలమలు ఏర్పాటు చేసుకుని బురద నీటినే తాగు నీరుగా ఉపయోగిస్తున్నారు. దీంతో పలువురు గ్రామస్తులు రోగాలబారిన పడుతున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Tags: Drinking water

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *