పుంగనూరు ఆర్‌బికెలలో మందులు , ఎరువులు

పుంగనూరు ముచ్చట్లు:
 
రైతులు పండించే పంటలకు అవసరమైన ఎరువులు, క్రిమిసంహరక మందులు రైతు భరోసా కేంద్రాలలో నిల్వ ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు మార్కెట్‌ కమిటి చైర్మన్‌ నాగరాజారెడ్డి తెలిపారు. శుక్రవారం వ్యవసాయ సలహామండలి సమావేశాన్ని ఏవో సంధ్య నిర్వహించారు. ఏఎంసీ చైర్మన్‌ మాట్లాడుతూ ప్రభుత్వం రైతులు నష్టపోకుండ ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోందన్నారు. ఆర్‌బికెల ద్వారా బ్యాంకింగ్‌ సేవలపై సలహాలు ఇవ్వడం జరుగుతోందన్నారు. వ్యవసాయ యంత్రాలను అద్దెకు ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. రైతులు పండించే పంటలు ఈక్రాప్‌లో నమోదు చేసుకోవాలని లేకపోతే ప్రభుత్వం అందించే రాయితీలు, నష్టపరిహారం అందకుండ పోతుందని తెలిపారు. రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో రైతులు రామచంద్రారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, నారాయణరెడ్డి, ధనుంజయరెడ్డి, వెంకటరెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి, శ్రీరాములురెడ్డితో పాటు ఏఈవో జయంతి తదితరులు పాల్గొన్నారు.
 
Tags: Drugs and fertilizers in Punganur RBK
 

Natyam ad