నడిరోడ్డు పై తాగుబోతులు ముష్టియుద్దాలు…

బి.కొత్తకోట ముచ్చట్లు :

బి.కొత్తకోట పట్టణంతో పాటు సమస్యలు పెరుగుతు అధికమవుతున్నాయి. నడిరోడ్డుపై ఈ మధ్య ముష్టియుద్దాలు ఎక్కువయ్యాయి. దీనికి గల కారణం ప్రధాన రోడ్డు పైనే  బార్ లు ఉండడం అక్కడే తాగి రోడ్ల పైకి వచ్చి ఈ విధంగా ముష్టి యుద్దాలకు దిగుతున్నారు.రోజు రోజుకు  పట్టణంలో ట్రాఫిక్ సమస్య  ఎక్కువగా ఉండడంతో దీనికి తోడు రోడ్డు పైన ఈ విధంగా తాగుబోతుల వీరంగం మరో సమస్య గా తయారయ్యింది.సోమవారం  పట్టణంలో స్థానిక బెంగుళూరు రోడ్డు పై ఓ తాగుబోతు వీరంగం సృష్టించాడు దీంతో అరగంటకు పైగా రోడ్డు ట్రాఫిక్ సమస్యనెలకొంది, మధ్యాహ్నసమయం కావడంతో పోలీసులు ఎవరు లేకపోయేసరికి నిమిష నిమిషానికి సమస్య జఠిలమయి ఎక్కువయ్యింది.ఎందుకు కొట్టుకుంటున్నారని ఒకరు అడిగినందుకు అతనిపై కూడ పిడిగుద్దులు పడడంతో ఎవరు దీనిని ఆపే ప్రయత్నం చేయలేదు. దీంతో సమస్య తీవ్రతరం కావడంతో మళ్లీ మొదటికొచ్చింది. పోలీసులు వచ్చి ఆ యువకుడిని అదుపులోకి తీసుకొనడంతో ట్రాఫిక్ సమస్య తొలగింది. ఇప్పటికైన పోలీసులు సీ.సీ కెమెరా పర్యవేక్షణలోనే కాకుండా ఇక్కడ ఒక కానిస్టేబుల్ ను వుంచి ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

 

Tag : Drunkards and thighs on the roadside …


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *