రుణాలకు డ్వా క్రా అడుగు..

విజయవాడ ముచ్చట్లు:
స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) రుణాల్లో జాతీయస్థాయిలో 30 శాతం వాటా కలిగిన రాష్ట్రంలో కొత్త రుణాలు క్రమంగా తగ్గుతున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోల్చితే రీపేమెంట్‌ 99 శాతం ఉన్నప్పటికీ కొత్త రుణాలంటేనే రాష్ట్రంలో డ్వాక్రా గ్రూపుల సభ్యులు భయపడుతున్నారు. రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యం పడిపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. డ్వాక్రా గ్రూపులకు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం బ్యాంకర్లకు టార్గెట్లను పెడుతున్నప్పటికీ, తీసుకునేందుకు గ్రూపులు మాత్రం ముందుకు రావడంలేదు. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం 3.13 లక్షల గ్రూపులు రుణాలు తీసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఒక నివేదిక వెల్లడించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్‌నాటికి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 4,05,269 గ్రూపులకు బ్యాంకులు రూ.18,192 కోట్ల రుణాలను బట్వాడా చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 3.13 లక్షల గ్రూపులు తగ్గగా, రుణ విలువ రూ.1,900 కోట్లు తక్కువగా ఉంది. ప్రభుత్వం తొమ్మిది శాతం వడ్డీకే లింకేజీ రుణాలను ఇస్తున్నప్పటికీ, డ్వాక్రా గ్రూపు సభ్యులు రుణాలు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణ ప్రాంతాల్లో రుణాలు తీసుకోని గ్రూపులే అధికంగా ఉన్నట్లు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బిసి) ఇటీవల వెల్లడించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్‌నాటికి బ్యాంకులు 2,17,129 గ్రూపులకు 10,859 కోట్ల లింకేజీ రుణాలను బట్వాడా చేశాయి. ఇందులో రూరల్‌ ఎస్‌హెచ్‌జిలు 1,97,387 గ్రూపులుండగా, పట్టణ ప్రాంతాలకు చెందినవి 19,747 మాత్రమే ఉండటం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్‌హెచ్‌జిలు 50 నుంచి 55 శాతం మంది రుణాలు తీసురకుంటుండగా, పట్టణ ప్రాంతాల్లో 25 శాతానికి మించడంలేదురాష్ట్రంలో రెండేళ్లగా ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. డ్వాక్రా గ్రూపుల్లో వ్యవసాయ కార్మికులు, చిరు వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారే అధికంగా ఉన్నారు. కరోనా కారణంగా పేద, బడుగు వర్గాల ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నమయ్యాయి. కార్పొరేట్‌, ప్రైవేటు సంస్థల ఇన్‌స్టాల్‌మెంట్‌లను ప్రభుత్వం వాయిదా వేసింది. అయితే, డ్వాక్రా గ్రూపు రుణాలకు అలాంటి మినహాయింపు లేకపోవడంతో చాలా సంఘాలు డిఫాల్టర్‌గా మారాయి. తీసుకున్న రుణాన్నిబట్టి ప్రతి నెలా కనీసం రూ.2,500 నుంచి రూ.5 వేల వరకు కిస్తీ కట్టాల్సి రావడం, సమయానికి డబ్బులు అందకపోవడంతో కొందరు సభ్యులు కట్టలేని పరిస్థితి వచ్చింది. దీంతో చాలా మంది సభ్యులు గ్రూపుల నుంచి వైదొలగగా, కొన్ని గ్రూపులు రుణాలు తీసుకోవడమే మానేశాయి. ఫలితంగానే రుణాల బట్వాడా తగ్గినట్లు బ్యాంకర్లు చెబుతున్నారు.
 
Tags:Dwa kra step for loans

Natyam ad