జ‌న‌వ‌రి 17 నుండి 25వ తేదీ వ‌ర‌కు వ‌స్త్రాల ఈ -వేలం

తిరుమల ముచ్చట్లు:
 
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన 354 లాట్ల వ‌స్త్రాల‌‌ను జ‌న‌వ‌రి 17 నుండి 25వ తేదీ వ‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు. ఇందులో సిల్క్‌, పాలిస్ట‌ర్ నైలాన్ / నైలెక్స్‌, ఆర్ట్ సిల్క్‌, ఓణీలు, బ్లౌజ్‌పీస్‌లు కొత్త‌వి, వినియోగించిన వ‌స్త్రాలున్నాయి.ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రును కార్యాలయం వేళల్లో గానీ, రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in / www.tirumala.org ను గానీ సంప్రదించగలరు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: E-auction of garments from 17th to 25th January

Natyam ad