సిటీ చుట్టూ ఎకో టూరిజం

Date:14/02/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
హైదరాబాద్ నగరానికి నలు దిశల మెడిసినల్ టూరిజం, ఎకో టూరిజం, డిస్టినేషన్ టూరిజం పార్క్‌లను అభివృద్ధి పరుచాలని ప్రభుత్వం నిర్ణయించింది. నగరానికి చుట్టూరా అవుటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ఉద్యాన వనాలను అభివృద్ధి పరుచడానికి హైదరాబాద్ మెట్రో డవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో 194 బ్లాక్‌లలో 58,329 అటవీ భూమిలో వీటిని అభివృద్ధి చేయనున్నారు. హైదరాబాద్ నగరవాసులకు ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం అందించడంతో పాటు పర్యాటకులను ఆకర్షించేలా అర్బన్ లంగ్స్ స్పేస్‌లను అభివృద్ధి చేయనున్నారు. వెల్‌నెస్ టూరిజం, మెడిసినల్ టూరిజం, డిస్టినేషన్ టూరిజం, ఎకో టూరిజాలుగా అభివృద్ధి పరిచేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సంబంధిత అధికారులను మంత్రి కెటిఆర్ ఆదేశించారు. దీంట్లో భాగంగా మూసీ రివర్ ఫ్రంట్‌ను కెబిఆర్ పార్క్ మాదిరిగా వాక్ వే ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. నగర పరిసర ప్రాంతాల్లో అటవీ జోన్లను అభివృద్థి చేయడానికి వివిధ శాఖలు లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని, నిర్ణీత గడువులోగా ప్రణాళికలను పూర్తి చేయాలన్నారు. వీటి అభివృద్ధికి అవసరమైన నిధుల సమీకరణ కోసం స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థల ద్వారా నిధులను సమీకరించుకోవాలని మంత్రి సూచించారు. పార్క్‌ల అభివృద్ధిలో పౌరులు, వాకర్స్ అసొసియేషన్స్‌ను భాగస్వామ్యం చేయాలన్నారు. అవుటర్ రింగ్‌కు చుట్టు పక్కల ప్రతి 10 కిలో మీటర్లకు ఒక చోట రంగు రంగుల పూల మొక్కలు, సువాసన మొక్కలను పెంచాలని సూచించారు. అలాగే మైనింగ్ జోన్స్ క్యారీలను పూడ్చివేసి పార్క్‌లను అభివృద్ధి చేయాలన్నారు. హెరిటేజ్ రాక్స్‌ను గుర్తించి టూరిజం సైట్స్‌గా అభివృద్ధి చేయాలన్నారు. అటవీశాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్ మాట్లాడుతూ జిహెచ్‌ఎంసి పరిధిలో 1360 హెక్టార్లలో 13 ఫారెస్ట్ బ్లాక్‌లు ఉండగా వాటిలో ఇప్పటికే 5 బ్లాక్‌లను పూర్తిగా, 8 బ్లాక్‌లను పాక్షికంగా అభివృద్ధి పరిచినట్టు వివరించారు.
Tags: Eco tourism around the city

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *