8.5 శాతం ఆర్ధిక వృద్ధి రేటు

న్యూఢిల్లీ ముచ్చట్లు:
 
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తరువాత రాష్ట్రపతి ప్రసంగించారు. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను లోక్‌సభలో సమర్పించారు. ఆర్థిక సర్వే ప్రకారం, 2022-23లో జీడీపీ వృద్ధి (ఆర్థిక వృద్ధి రేటు) 8-8.5%గా అంచనా వేశారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ సర్వేను రాజ్యసభలో సమర్పిస్తారు. దీని తరువాత సర్వే పూర్తి వివరాలను బహిరంగపరుస్తారు.ఆర్ధిక సర్వే ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ ఆర్థిక సమీక్షలో, రెండవ అలాగే మూడవ కరోనా వేవ్ మధ్య దేశం ఎలా పురోగమించిందో తెలుస్తుంది. ఆర్థిక సర్వే ప్రకారం, 2022-23లో 8-8.5% ఆర్థిక వృద్ధి రేటు అంచనా వేశారు. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనా 9.2% కంటే తక్కువ.మధ్యతరగతి ప్రజల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్న దేశంలో మనం జీవిస్తున్నాం. మనలో చాలామంది ఇంట్లో డైరీ రాస్తుంటారు. సాధారణంగా మన ఇళ్లలో డైరీ అంటే ప్రతిరోజూ వారీ ఖర్చులు.. ఆదాయాల వివరాలను నింపి పెడుతుంటారు. నిజానికి డైరీ వేరైనా మనలో ఎక్కువమంది చేసే పని ఇదే. సంవత్సరం పూర్తయిన తరువాత ఆ డైరీని చూస్తె మన ఇంట్లో ఖర్చులు ఎలా చేశాం.. ఆదాయం ఎలా వచ్చింది. పొడుపు ఎంత చేశాం.వంటి వివరాలు అన్నీ అందులో ఉంటాయి. దాని ఆధంగా మనం వచ్చే సంవత్సరంలో ఖర్చులు ఎలా పెట్టాలి? పొడుపు ఎలా చేయాలి వంటి ఆర్ధిక అంశాలను నిర్ణయించుకుంటాం. సరిగ్గా ఇటువంటిదే దేశ ఆర్థిక సర్వే కూడా. ఇది అచ్చు మన మన ఇంటి డైరీ లాంటిదే. ఆర్ధిక సర్వే మన దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ఆర్థిక సర్వేలో, గత సంవత్సరం లెక్కలు..రాబోయే సంవత్సరానికి సూచనలు, సవాళ్లుఅలాగే పరిష్కారాలను ప్రస్తావిస్తారు.
గుండెపోటుతో నిరుద్యోగి మృతి
Tags: Economic growth rate of 8.5 percent

Natyam ad