Edgar Alan Poe is a terrifying prophecy

ఎడ్గార్‌ అలాన్‌ పో భయానకమైన భవిష్యవాణి

Date : 14/12/2017

హైదరాబాద్‌ ముచ్చట్లు:

భావి హారర్‌ పితగా పేరుపొందబోయే ఎడ్గార్‌ అలాన్‌ పో 1838లో ‘ది నెరేటివ్‌ ఆఫ్‌ ఆర్థర్‌ గోర్డాన్‌ పిమ్‌ ఆఫ్‌ నంటుకెట్‌’ అన్న పేరుతో ఓ పుస్తకాన్ని అచ్చువేసాడు. ఇదో పెద్ద ఫెల్యూర్‌. ఇది చాలా సిల్లీ పుస్తకమని తన విమర్శకుల తిట్లని పో కూడా ఒప్పుకొనేసేంతగా విఫలమైందీ పుస్తకం. ఇందులో నమ్మలేని భయంకరమైన విషయమేదని ఆశ్చర్యపోతున్నారా? ఈ నవలలో ఓ సన్నివేశమొస్తుంది. అందులో సముద్రంలో మునిగిపోయిన ఓడలో చావగా మిగిలిన ఐదుమందిలో నలుగురు కలిసి ఓ కేబిన్‌ బాయ్‌ ను చంపి తినేసి వాళ్ళ ఆకలిని తీర్చుకొంటారు. ఆ చంపబడే యువకుడి పాత్ర పేరు రిచర్డ్‌ పార్కర్‌ (కన్పూజ్‌ కాకండి. మన స్పైడర్‌మేన్‌ పేరు పీటర్‌ పార్కర్‌). ఈ నవల ప్రచురించబడ్డ నలభై ఎనిదేళ్ళకు మిగ్నోనెట్‌ అనబడే ఓడ ఒకటి మునిగిపోయింది. అందులో చావగా మిగిలినవాళ్ళు కేబిన్‌ క్రూలో ఒకడైన యువకుణ్ణి చంపి తినేసారు. ఆపై అదో గొప్ప సంచలనాత్మకమైన కోర్ట్‌ కేసుగా ప్రసిద్ధిచెందిది. ఇప్పుడు కొంచెం భయంకరంగా అనిపిస్తోంది కదూ!

Tags : Edgar Alan Poe is a terrifying prophecy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *