తెలంగాణలో ఎలక్ట్రిక్ బస్సులు

Date:14/02/2018
హైద్రాబాద్  ముచ్చట్లు:
పర్యావరణ పరిరక్షణ.. కాలుష్య నియంత్రణ.. ప్రస్తుతం ప్రపంచం దృష్టంతా పర్యావరణ అనుకూల ఉపకరణాలు, వాహనాలపైనే. తెలంగాణ RTC కాలుష్య నియంత్రణపై దృష్టి పెట్టింది. డీజిల్‌ బస్సులను క్రమంగా తప్పించాలని చూస్తోంది. వాటి స్థానంలో ఎలక్ట్రిక్‌ బస్సులను వినియోగించాలని.. మొదటి దశలో 40 బస్సులను రెంటు ప్రాతిపదికన తీసుకోవడానికి రెడీ అవుతోంది. రెండో దశలో 60 బస్సులను తీసుకుని, మొత్తం 100 బస్సులను హైదరాబాద్‌లో నడపాలని నిర్ణయించింది.ఫలితాలను బేరీజు వేసుకొని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడంపై నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పెట్రోలు, డీజిల్‌పై తీవ్ర ఆందోళనలు రేకెత్తుతున్నాయి. దేశంలో ఆర్టీసీ లాంటి ప్రజా రవాణా వ్యవస్థల కింద లక్షా 70వేల బస్సులున్నాయి. ఒక్క టీఎ్‌సఆర్టీసీలోనే 10 వేలకు పైగా బస్సులున్నాయి. ఇవన్నీ డీజిల్‌తో నడుస్తున్నవే. ఈ బస్సులు కాలుష్య కారకాలుగా మారుతున్నాయి. ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి ఎలక్ట్రిక్‌ బస్సులను నడపాలని టీఎ్‌సఆర్టీసీ నిర్ణయించింది. 2030 నాటికి దేశ వ్యాప్తంగా 80 శాతం ఎలక్ట్రిక్‌ బస్సులే ఉండాలని కేంద్ర రోడ్డు రవాణా సంస్థ ప్రకటించింది. ఇందులో భాగస్వామ్యం కావాలన్న ఉద్దేశంతో తెలంగాణ RTC క్రమంగా ఎలక్ట్రిక్‌ బస్సులను పెంచుకోవడంపై దృష్టి సారించింది. ఫిబ్రవరి 16లోపు టెండర్లు దాఖలు చేయాలని, అదేరోజు సాయంత్రం టెండర్లను తెరుస్తామని ప్రకటించింది. నగరంలో వేగంగా విస్తరిస్తున్న మెట్రో రైలుతో ఈ ఎలక్ట్రిక్‌ బస్సులను అనుసంధానించనుంది.
Tags: Electric buses in Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *