మహిళా ఎక్స్ పో ను ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్ ముచ్చట్లు:
 
హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బిజినెస్ ఉమెన్ ఎక్స్పో 2022ను ఎంమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్యఅతిధిగా హాజరై ప్రారంభించారు. తరువాత  కార్యక్రమం లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. కవితమాట్లాడుతూ కోవిడ్ సమయంలో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రభుత్వం  తో పాటు పారిశ్రామికవేత్తలు అనేక చర్యలు చెప్పట్టి అండగా ఉండాలని  కోరారు..మహిళా సాధికారత కోసం కోవే
సంస్థ తెలంగాణ ప్రభుత్వం తో పనిచేయడం మంచి పరిణామం అని అన్నారు…ముక్యంగా కాలేజీ స్థాయిలో పరిశ్రమలు ఎలా స్థాపించాలని అవగాహనా చేస్తే ఉద్యోగం కాకుండా ఉపాధికల్పించినవాళ్ళమవుతామని ఆమె అన్నారు…మహిళలకు ఉద్యోగ కల్పన తో పాటు, పారిశ్రామికంగా తోడ్పాటు అందించాలని ఆమె కోరారు..మహిళాల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న కోవే సంస్థ ను ఆమెఅభినందించారు…ఈ కార్యక్రమం లో డిక్కీ, హైసియ ప్రతినిధులు పాల్గొన్నారు.
 
Tags; Emmelsie poem that opened the Women’s Expo

Natyam ad