Employees' APPO affair with abuse of employment officer

ఉపాధి అధికారి వేధింపులకు బలైన ఏపివో అనురాధ

– వేధింపులపై చర్యలకు డిమాండు
– ఆనాధలైన ఇద్దరుపిల్లలు, భర్త
– ఆందోళనకు సిద్దమౌతున్న ఉద్యోగులు

Date:14/02/2018

తిరుపతి ముచ్చట్లు:

గ్రామీణ రైతుకుటుంబంలో పుట్టి, పేద ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో ఉన్నత చదువులు చదివి, ఉపాధి ఏపీవోగా సేవలు అందిస్తూ ఉన్నతాధికారి వేధింపులకు తట్టుకోలేక, తీవ్రమైన మానసిక ఒత్తిడికిలోనై, తలలో నరాలు చిట్లిపోయి, అర్ధాంతరంగా అశువులుబాసిన అనురాధ మృతిని ప్రజలు, చిత్తూరు జిల్లా ఉపాధి ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. అనురాధ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తున్నారు. ఇందుకు నిరసనగా ఒకరోజు నల్లబ్యాడ్జిలు ధరించి, విధులలో నిరసన తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.

చిత్తూరు జిల్లా, కలికిరి మండలం ఆరవాండ్లపల్లెకు చెందిన రైతు భాస్కర్‌రెడ్డి భార్య అనురాధ ఎంఏ చదివారు. వీరికి నిఖిత(12) , తోహిత్‌(7)  ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రామీణ కుటుంబంలో పుట్టిన అనురాధ ఎంఏ వరకు చదివి, ఉపాధి పథకంలో ఏపీవోగా సదుం మండలంలో పని చేస్తున్నారు. ఇలా ఉండగా గత సంవత్సరం వరకు జిల్లాలో సజావుగా జరిగిన ఉపాధి పథకం నూతన మలుపు తిరిగింది. ఆనాలోచితంగా, అనుభవం లేని వివాదాస్పదమైన అధికారి వచ్చిరాగానే ఉపాధి ఉద్యోగులపై కన్నెర్ర చేశాడు. జిల్లాలోని 66 మండలాల్లోని 22 మంది ఏపీవోలను, టెక్నికల్‌ అసిస్టెంట్లను, 20 మంది ఫీల్డ్అసిస్టెంట్లపై వేటు వేశారు. ఇలాంటి చర్యలతో ఉపాధి ఉద్యోగులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైయ్యారు. ఇలా ఉండగా అనురాధను బదిలీ చేస్తూ, జీడినెల్లూరు, వాయుల్పాడు, బిఎన్‌కండ్రిగ మండలాలకు బదిలీ చేసి వేధించారు. దీని కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన అనురాధ ఆనారోగ్యంతో బెంగళూరు, చెన్నై ఆసుపత్రులలో చికిత్సలు చేసుకుంది. మెదడులో నరాలు చిట్లిపోవడంతో ఆరోగ్యం కుదుటపడక మంగళవారం మృతి చెందింది. వైద్యం కోసం భర్త భాస్కర్‌రెడ్డి సుమారు రూ.20 లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది. అనురాధ మృతితో భాస్కర్‌రెడ్డి, ఇద్దరు చిన్నారులు అనాదలైయ్యారు. ఈమె మృతితో జిల్లాలోని ఉపాధి ఉద్యోగులు విషాదంలో మునిగిపోయారు.


ఆనాలోచిత చర్యలే…..

ఉపాధిహామి పథకంలో అనుభవం లేకుండ వివాదస్పాదమైన అధికారి బదిలీపై చిత్తూరుకు వచ్చి జిల్లా సిబ్బందిపై అసత్య ఆరోపణలతో జిల్లా కలెక్టర్‌కు తప్పుడు నివేదికలు ఇచ్చేవారని, ఉద్యోగులను వేధించేవాడని ఆరోపణలు ఉన్నాయి. దీని కారణంగా నిజాయితీగా పని చేస్తున్న ఉద్యోగులకు కష్టాలు అధికమైందని పలువురు అంటున్నారు. ఇందులో భాగంగానే అనురాధ మృత్యువాత పడిందని అంటున్నారు.

అంత్యక్రియలకు హాజరైన జెసి చంద్రమౌళి…

అధికారుల వేదింపులతో మృతి చెందిన అనురాధ మృత దే హాన్ని చిత్తూరు జిల్లా సంయుక్త కలెక్టర్‌ -2 చంద్రమౌళి సందర్శించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే ఉపాధి ఉద్యోగులు, సిబ్బంది అనురాధ మృతికి నివాళులర్పించారు. కానీ ఉపాధి పీడి అంత్యక్రియలకు హాజరుకాకపోవడం, బాధితుల కుటుంబాన్ని పరామర్శించకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది.

ఆందోళనకు సిద్దిం….

ఉపాధిహామి ఏపీవో అనురాధ అధికారుల వేధింపులకు మృతి చెందిందని ఆరోపిస్తూ జిల్లా ఉప్యాధి ఉద్యోగులు ఆందోళనకు సిద్దమౌతున్నారు. ఈ విషయమై చిత్తూరులో సమావేశమైయ్యారు. అనురాధ మృతిపై విచారణ జరిపి, బాధ్యులైన అధికారులపై కలెక్టర్‌ ప్రద్యుమ్న చర్యలు తీసుకోవాలని, అనురాధ కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం అందించాలని డిమాండు చేస్తున్నారు. ఈ విషయమై చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్త ఆందోళన చేపట్టి, ఉధ్యమం తీవ్రరూపం చేయనున్నట్లు తెలిసింది.

 

Tags: Employees’ APPO affair with abuse of employment officer

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *