ఖాళీ అవుతున్న  మిడ్మానేరు.

వరంగల్  ముచ్చట్లు:
 
ఇటీవల సీఎం కేసీఆర్ ప్రారంభించిన మల్లన్న సాగర్కు నిరంతరాయంగా నీళ్లు ఎత్తిపోస్తుండడంతో మిడ్మానేరు క్రమంగా ఖాళీ అవుతోంది. దీంతో అందులో మునిగిన పాత ఊళ్లన్నీ ఒక్కొక్కటే బయటపడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు మిడ్మానేరు నుంచి అనంతగిరి, రంగనాయకసాగర్‌, తడ్కపల్లి పంపుహౌస్‌ల ద్వారా మల్లన్నసాగర్‌కు 13 టీఎంసీల వాటర్ ఎత్తిపోశారు. 50 టీఎంసీల కెపాసిటీ ఉన్న ఈ  రిజర్వాయర్ మొదటిసారి పూర్తిస్థాయిలో నింపాల్సి ఉంటుందని, ఇందుకు కనీసం రెండేళ్లు పట్టే అవకాశముందని ఇంజినీర్లు చెబుతున్నారు.  రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని మిడ్మానేరు ప్రాజెక్టు కెపాసిటీ 27.5  టీఎంసీలు. కొద్దిరోజులుగా ప్రాజెక్టు నుంచి మల్లన్నసాగర్కు నీటిని విడుదల చేస్తుండటంతో మిడ్ మానేరులో నీటి నిల్వ క్రమంగా తగ్గుతోంది. దీంతో రిజర్వాయర్లోని వరదవెల్లి, కొదురుపాక, నీలోజిపల్లి తదితర గ్రామాలు తేలుతున్నాయి. రోడ్లు కూడా క్లియర్గా కనిపిస్తుండడంతో నిర్వాసితులు వారి గ్రామాల్లో కొద్దిసేపు గడిపి, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. కొందరు ఇండ్ల గోడలపైకి ఎక్కి ఉద్వేగానికి లోనవుతున్నారు. మిడ్మానేరులో నీళ్లు తగ్గిపోతుండడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను మిడ్మానేరుకు తరలిస్తున్నారు. ఇప్పటివరకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నంది మేడారం లిఫ్ట్ ద్వారా 6 టీఎంసీలు లిఫ్ట్ చేశారు. మరో 3 టీఎంసీలు తరలించనున్నట్టు ఆఫీసర్లు చెబుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఫుల్ కెపాసిటీ 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుతం 12 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నీటి మట్టం మరింత తగ్గితే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి లిఫ్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మిడ్ మానేరులో మా ఊరు నీలోజిపల్లి మునిగిపోయింది. ప్రాజెక్టు  నిండా నీళ్లు ఉండడంతో ఇన్నాళ్లూ మా గ్రామాన్ని చూడలేకపోయాం. కొన్ని రోజులుగా ప్రాజెక్టు నుంచి నీటిని మల్లన్నసాగర్కు పంపుతుండడంతో పాత గ్రామం తేలింది. దీంతో ఊరు చూసేందుకు వచ్చినం. మొండి గోడలు చూస్తే కన్నీళ్లు ఆగుతలేవు. ఉన్న ఊరును, కట్టిన ఇండ్లను వదిలేసి వెళ్లిన మాలాంటి వాళ్లకు ప్రభుత్వం ఎంత చేసినా తక్కువే.మిడ్ మానేరు ప్రాజెక్టులో మా ఊరితోపాటు చాలా గ్రామాలు మునిగిపోయాయి. నీళ్లు తగ్గడంతో మా ఊరు క్రమంగా తేలుతోంది. దీంతో పాత గ్రామాన్ని చూసేందుకు వచ్చినం. ఆ దృశ్యాలు చూస్తుంటే పాత జ్ఞాపకాలతో ఆనందం, బాధ ఒకేసారి కలుగుతున్నాయని నిర్వాసితులు చెబుతున్నారు.
 
Tags:Emptying Midmaner

Natyam ad