Encourage fishermen

మత్స్యకారులకు ప్రోత్సాహం

 Date:15/09/2018
సంగారెడ్డి  ముచ్చట్లు
సంగారెడ్డి కలెక్టరేట్ లో మత్స్య అభివృద్ధి పథకం కింద 442 మంది లబ్దిదారులకు  22 కోట్ల తో సబ్సిడీ వాహనాలు, ఉప కరణాలను ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బి. బి. పాటిల్ శనివారం పంపిణీ చేసారు. ఈ సందర్బంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్ల్లడూ మత్స్య కారులను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం మత్స్య కారుల కోసం ఉచితంగా చెరువులలో కోట్లాది చేప పిల్లలను వదిలింది.
మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం తో పాటు మత్స్య కారులకు వాహనాలు సబ్సిడీ కింద ఇస్తున్నామని అన్నారు. తెలంగాణ లోఇప్పుడు మత్స్యకారులు జీవన ఉపాధి అవకాశాలతో పాటు ఆర్ధికంగా ఎదుగుతున్నారు. చేపల పెంపకం లో అధునాతన పద్దతుల ను ప్రభుత్వం ప్రోత్సహించింది. మత్స్య సంపద పెంచడానికి సీఎం కేసీఆర్ పలు చర్యలు తీసుకున్నారని అన్నారు.
Tags:Encourage fishermen

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *