Enthusiastically subscribed membership program

ఉత్సాహంగా తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమం

Date:25/11/2018

పలమనేరు ముచ్చట్లు:

పలమనేరు మునిసిపల్ పరిధిలోని బొమ్మిదొడ్డిలో ఆదివారం జరిగిన తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభ్యత్వనమోదు కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు మహిళలు స్వచ్ఛందంగా తెదేపాలో చేరడంతో పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హేమంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. త్వరలో హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా రైతులకు నీరు అందుతుందని తెలిపారు. తెదేపా ప్రభుత్వంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలు గుర్తించారని తెలిపారు.తెదేపాతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందిందని తెలిపారు. ఎన్నడూ లేని విధంగా అధిక సంఖ్యలో వితంతు, వృద్ధాప్య, వికలాంగ పెన్షన్లతో పాటు నిరుద్యోగభృతి సైతం ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మయ్య, అమలు, కృష్ణమూర్తి, నాగరాజు, కోటి, రూపేష్, శంకర్, సుబ్రహ్మణ్యం, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జోరుగా తెదేపా సభ్యత్వ నమోదు

Tags:Enthusiastically subscribed membership program

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *