ఈపీడీసీఎల్ ముట్టడి

విశాఖపట్నం ముచ్చట్లు:
 
పెంచిన విద్యుత్ చార్జీలను రద్దు చేయాలని సిపిఐ, సిపిఎం పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యుత్ ఛార్జీలపై జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణ లో విద్యుత్ చార్జీలు పెంచవద్దని ఆ పార్టీలు నిరసన వ్యక్తం చేసాయి. ఇందులో భాగంగా గురుద్వార్ వద్ద ఈపీడీసీఎల్ ప్రధాన కార్యాలయాన్ని వామపక్ష నేతలు ముట్టడించారు. ఈ సందర్భంగా విద్యుత్ డిస్కంలు ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కరోణ కాలంలో పెరిగిన ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో మళ్లీ విద్యుత్ చార్జీలు పెంచాలని జరుపుతున్న ప్రజాభిప్రాయ సేకరణ ను నిలిపి వేయాలని కోరారు. ధర్నా కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణ, సిపిఐ నగర కార్యదర్శి పైడ్రాజు, సిపిఎం నాయకులు జోగినాయుడు, సిపిఎం కార్పొరేటర్ గంగారాం తదితరులు పాల్గొన్నారు.
దాడులను అరికట్టాలి
Tags; EPDCL siege

Natyam ad