మేడారంలో రాజకీయాలా-మంత్రి  ఎర్రబెల్లి

మేడారం ముచ్చట్లు:
 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిచ్చోడా, మంచోడా….సమ్మక్క సారలమ్మల దర్శనానికి వచ్చి రాజకీయాలు మాట్లాడతారా.. అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఫైర్ అయ్యారు. అన్ని గుడులు,
దేవాలయాలు తిరిగే ప్రధాని నరేంద్ర మోదీ మేడారం ఎందుకు రాలేదని ప్రశ్నించారు. గిరిజన జాతరపై ఎందుకు చిన్నచూపని ఎర్రబెల్లి నిలదీశారు. కుంభమేళాకు కోట్లాది రూపాయలు కేటాయించిన కేంద్ర
ప్రభుత్వం… మేడారం జాతరకు 2కోట్లు ఇస్తుందా… అని ప్రశ్నించారు. హిందూ ధర్మం అని చెప్పే బీజేపీకి మేడారం అభివృద్ధి పట్టదా… అని నిలదీశారు. మత చిచ్చులు పెట్టి లబ్ది పొందాలని చూస్తున్నారంటూ
మండిపడ్డారు. బీజేపీ నేతల తీరు మార్చుకోవాలి లేదంటే జంపన్న యుద్ధం చేసిన మాదిరిగా ఉరికించి కొడతామని ఎర్రబెల్లి హెచ్చరించారు.
 
Tags: Errabelli, Minister of Politics in Medaram

Natyam ad