ఎదుట ఎర్రజెండా..నుక పచ్చజెండా అదీ పరిస్థితి

తాడేపల్లి ముచ్చట్లు:
 
‘ఎదుట ఎర్రజెండా… వెనుక పచ్చజెండా’ అన్న చందంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఎర్రజెండా, పచ్చజెండాలు కలిసి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారని సీఎం జగన్ విమర్శించారు. ఈరోజు (మంగళవారం) ‘జగనన్న చేదోడు’ రెండో ఏడాది నగదు విడుదల కార్యక్రమంలో మాట్లాడిన సీఎం జగన్.. ‘పేద ఇళ్లను అడ్డుకున్న చంద్రబాబు.. కామ్రేడ్లకు మిత్రుడు. చంద్రబాబుకు, ఎల్లో మీడియాకు మాత్రమే సమ్మె కావాలి. ఉద్యోగులు సమ్మె విరమించారనగానే కామ్రేడ్లను ముందుకు తోశారు. ఎర్రజెండా వెనుక పచ్చజెండా ఉంది. సీఎంను తిడితే ఇంకా బాగా కవరేజ్ ఇస్తారు. ఉద్యోగులను ఎర్రజెండాలు-పచ్చజెండాలు కలిసే రెచ్చగొట్టారు.
 
Tags: Errajenda in front..so green flag is the situation

Natyam ad