పుంగనూరులో చురుగ్గా జగనన్న మార్ట్ ల ఏర్పాటు పనులు

పుంగనూరు ముచ్చట్లు:
 
 
మున్సిపాలిటిలోని మహిళా సంఘాలచే ప్రారంభించనున్న జగనన్న మహిళా మార్ట్ భవన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మెప్మా పీడీ రాధ ఆధ్వర్యంలో పట్టణ టౌన్‌మిషన్‌ కోఆర్డినేటర్‌ రవి పనులను చేపట్టారు. 100 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పుతో విశాలంగా ప్రజలను ఆకట్టుకునేలా మార్ట్ లు  ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్‌ దీపాలు, పీవోపి డిజైన్లతో సుమారు రూ.35 లక్షల పెట్టుబడితో మార్ట్ ఏర్పాటు చేస్తారు.ప్రైవేటు సూపర్‌బజార్లకు ధీటుగా సిద్దం చేస్తున్నారు. మార్చి 8 మహిళా దినోత్సవం రోజున మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిచే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయమై మహిళా సంఘాలచే ప్రజల్లో అవగాహన కల్పించి, మహిళలు వ్యాపారంలో రాణించేలా చర్యలు తీసుకుంటున్నట్లు రవి తెలిపారు.
 
Tags: Establishment of active Jagannath Marts in Punganur

Natyam ad