Establishment of canteens in Eluru city

ఏలూరు నగరంలో అన్న క్యాంటీన్ల ఏర్పాటు

పేదలకు తక్కువ ధరకే ఆహ్వారం: బడేటి బుజ్జి

Date:11/01/2018

ఏలూరు ముచ్చట్లు:

ఏలూరు నగరంలో పేదలకు భోజనం కానీ, టిఫిన్‌ కానీ ఐదు రూపాయలకే అందించడానికి అన్నా కేంటీన్‌లను త్వరలో ప్రారంభించనున్నట్లు శాసనసభ్యులు బడేటి బుజ్జి చెప్పారు. స్ధానిక 24వ డివిజన్‌ ఫిరంగులదిబ్బ వద్ద జరిగిన జన్మభూమి గ్రామసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు యువకులకు రెంటు ఆటోలను బడేటి బుజ్జి పంపిణీ చేసారు. సమాజంలో పట్టెడన్నం దొరకక అర్ధాకలితో ఏఒక్కపేదవాడూ జీవించడానికి వీల్లేదని ప్రతీ ప్రాంతంలో అన్న కేంటీన్‌లు ఏర్పాటు చేసి పేదలకు ఆహార భద్రత కల్పించి తీరతామని బుజ్జి చెప్పారు. కోడళ్లు సరిగ్గా చూడక కుటుంబ సభ్యుల ఆదరణకు నోచుకోని ఎంతోమంది వృద్ధులు అన్న కేంటీన్‌లో ఐదు రూపాయలకు నాణ్యమైన భోజనం, ఐదు రూపాయలకు టిఫిన్‌ అందించే బృహత్తర కార్యక్రమాన్ని త్వరలో చేపట్టనున్నట్లు బడేటి బుజ్జి చెప్పారు. అన్న కేంటీన్‌లు ఏర్పాటు చేయాలని ఎప్పటినుండో ప్రభుత్వం యోచిస్తోందని అయితే ఈ కేంటీన్‌లను పటిష్టవంతంగా నిర్వహించడానికి అనువైన మార్గదర్శకాల రూపకల్పన, అవసరమైన ఏర్పాట్లు చేయడం వలన కొంత జాప్యం జరిగిందని త్వరలోనే చంద్రబాబు సారథ్యంలో ప్రతీ ప్రాంతంలో అన్న కేంటీన్‌లు ఏర్పాటు జరగబోతోందని తొలిదశగా జిల్లా ప్రధాన కేంద్రమైన ఏలూరు నగరంలో అన్న కేంటీన్‌లు ప్రారంభానికి చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. సమాజంలో ఎంతోమంది పేదవర్గాలు ఒకపూట తిండి లేకుండా బాధపడకూడదనే ఉద్ధేశ్యంతో చంద్రబాబు దశలవారీగా అన్ని ప్రాంతాల్లో అన్న కేంటీన్‌లు ఏర్పాటు చేసి ఐదు రూపాయలకే భోజనం, ఐదు రూపాయలకే టిఫిన్‌ అందించే నూతన కార్యక్రమాన్ని చేపట్టనున్నారని, వృద్ధులు తమకు వచ్చే పెన్షన్‌లో నెలకు 300 రూపాయలు ఖర్చు చేస్తే రెండుపూటలా ఆహారం పొందవచ్చునని, మందులకు రెండు వందల రూపాయలు ఖర్చయినా మిగిలిన 500 రూపాయలతో ఆనందంగా జీవించగలుగుతారని బడేటి బుజ్జి చెప్పారు. ఏలూరు మేయరు షేక్‌ నూర్జహాన్‌ మాట్లాడుతూ సరిక్రొత్త సాంకేతిక విప్లవాన్ని పేదలకు అందించేందుకు ప్రపంచంలోనే తొలిసారిగా 149 రూపాయలకే ఆఫ్టికల్‌ ఫైబర్‌ సౌకర్యాన్ని ఇంటింటా కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రతీ ఇంట్లో ఈకనెక్షన్‌ ఉంటే ఇంటర్నెట్‌, టెలిఫోన్‌, టివి, తదితర సేవలు 149 రూపాయలకే పొందవచ్చునని చెప్పారు. ఫైబర్‌ నెట్‌ వర్క్‌ ద్వారా విద్యార్ధుల బంగారు భవిష్యత్తును బాటలు వేయగలుగుతారని రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ విధానాన్ని ప్రవేశపెట్టి 20 వేల సిసి కెమోరాలను అనుసంధానం చేసి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఏమిజరుగుతుందో క్షణాలలో తెలుసుకునే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమరావతి నుండే చంద్రబాబు శ్రీకారం చుట్టారని నూర్జహాన్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్‌ సభ్యులు యస్‌యంఆర్‌ పెదబాబు, ప్రభుత్వ విప్‌ గూడవల్లి శ్రీనివాసు, ఎఎంసి వైస్‌ ఛైర్మన్‌ లింగిశెట్టి శశికుమార్‌, కార్పోరేటర్లు దాకారపు రాజేశ్వరరావు, కప్పా ఉమామహేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్‌యన్‌ఆర్‌ నాగేశ్వరరావు, దావాల శిరీషా, తదితరులు పాల్గొన్నారు.

Tags : Establishment of canteens in Eluru city

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *