Even if India slows down import duty, the United States does not have any money

భారత్‌ దిగుమతి సుంకాన్ని  తగ్గించినా అమెరికాకు ఒరిగేదేమీ లేదు

–  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌
Date:27/02/2018
వాషింగ్టన్‌  ముచ్చట్లు:
అమెరికాలో తయారయ్యే హార్లీ డేవిడ్‌సన్‌ బైక్‌ల వ్యవహారంలో ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి అక్కసు వెళ్లగక్కారు. విదేశాల్లో తయారయ్యే బైకులపై 75 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 50 శాతానికి తగ్గించినట్లు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ తనకు ఫోన్‌ చేసి చెప్పారంటూ అన్ని రాష్ట్రాల గవర్నర్‌లతో శ్వేతసౌధంలో సమావేశం అయిన సందర్భంగా ట్రంప్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అత్యంత ఖరీదైన ద్విచక్ర వాహనాలపై భారీ స్థాయిలో విధిస్తున్న దిగుమతి సుంకాన్ని భారత్‌ ఇటీవల తగ్గించినా ఆ చర్యతో అమెరికాకు ఒరిగేదేమీ లేదని మండిపడ్డారు. దిగుమతి సుంకం తగ్గింపుతో అమెరికాకు ఏదో మేలు చేసినట్లు భారత్‌ అనుకుంటూ ఉన్నా అలాంటిదేమీ లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‌కు మాత్రం 50 శాతం దిగుమతి సుంకం రూపంలో ఆదాయం సమకూరుతుందని ధ్వజమెత్తారు. భారత్‌లో తయారయ్యే ద్విచక్ర వాహనాలను దిగుమతి చేసుకుంటున్నా తమకు ఎలాంటి లబ్ధి చేకూరడం లేదని ట్రంప్‌ వివరించారు. హార్లీ డేవిడ్‌సన్‌ బైకుల విషయంలో ట్రంప్‌ మండిపడడం రెండు వారాల వ్యవధిలో ఇది రెండోసారి. అవసరమైతే అమెరికాలో అమ్ముడయ్యే భారతీయ మోటార్‌ సైకిళ్లపై దిగుమతి సుంకాన్ని పెంచుతామని ఈ నెల 14న ఆయన హెచ్చరించారు.
Tags: Even if India slows down import duty, the United States does not have any money

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *