mpp

ప్రతి ఒక్కరిలో భక్తి భావం పెంపొందాలి

Date: 13/12/2017

చౌడేపల్లె ముచ్చట్లు:

ప్రజలందరు దైవత్వం పట్ల భక్తిభావం కలిగి ఉండాలని ఎంపిపి అంజిబాబు అన్నారు. బుధవారం మండలంలోని చింతమాకులపల్లె గ్రామంలో తిరుమల -తిరుపతి దేవస్థానం చేయూతతో సుమారు రూ.5 లక్షల నిధులతో సమరసతసేవా సమితి వారి ఆధ్వర్యంలో మారెమ్మ దేవత ఆలయ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపిపి మాట్లాడుతూ టీటీడీ వారి గ్రామీణ ప్రాంతాలలో దేవాలయాలు నిర్మించడం హిందూ సమాజాన్ని మరింత అభివృద్ధికి దోహదపడుతున్నాయని గుర్తించారు. యువత సమాజసేవతో పాటు దైవచింతనతో మెలిగి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ రెడ్డెప్ప, పంచాయతీ కార్యదర్శి లత, మాజీ సర్పంచ్‌లు నరసింహాయాదవ్‌, నరసింహారెడ్డి, సమరసతసేవా సంఘం ప్రతినిధులు రెడ్డెప్ప, గురుమూర్తి, గ్రామపెద్ద గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tag: Everybody should develop the sense of devotion

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *