ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహకారం అందించాలి-ట్రాఫిక్ సీఐ ఎం .యుగంధర్
నెల్లూరు ముచ్చట్లు:
ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలని ప్రొద్దుటూరు ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎమ్. యుగంధర్ పేర్కొన్నారు. జె.డి.ఫౌండేషన్ మరియు శ్రీరామరాజు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ప్రొద్దుటూరు శ్రీ రాజరాజేశ్వరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నందు “ప్లాస్టిక్ వాడకాన్ని నివారిద్దాం- పర్యావరణాన్ని పరిరక్షిద్దాం!” అనే అంశంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఐ యుగంధర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మానవుని జీవితంలో ప్లాస్టిక్ ఒక భాగంగా మారిపోవడం ఎంతో బాధాకరమన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల రీత్యా ,భవిష్యత్ కార్యాచరణ కై ప్లాస్టిక్ వాడకాన్ని నివారించాలని కోరారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వాడకం వలన కలుగు అనర్థాలను వివరించారు . ఈ సందర్భంగా
శ్రీరామరాజు చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి కె.మురళీమోహన్ రాజు మాట్లాడుతూ భారతదేశ జనాభా 130 కోట్లమంది రోజుకు ఒక్క ప్లాస్టిక్ కవర్ వాడితే 130కోట్ల ప్లాస్టిక్ సంచులు అవుతాయన్నారు. ఇవి భూమిలో కరగవని అందరికీ తెలిసి కూడా ప్లాస్టిక్ వాడుతున్నామంటే భవిష్యత్తు తరాలకు మనం అనారోగ్యాన్ని మిగులుస్తున్నారని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ కు బదులుగా క్లాత్ బ్యాగ్స్ వాడవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి మనం ఫౌండేషన్ అధ్యక్షుడు చక్రవర్తి సభాధ్యక్షుడుగా వ్యవరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పాండురంగన్ రవి, రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు వై.చంద్రశేఖర్ రెడ్డి, ప్రొద్దుటూరు ఎలట్రిషన్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ. శ్రీనివాసులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags:Everyone should contribute to building a plastic-free society – Traffic CI M. Yugandhar