Everything is Fraud: YS Jagan

అంతా మోసం : వైఎస్ జగన్

Date:13/02/2018
నెల్లూరు ముచ్చట్లు:
సీఎం చంద్రబాబునాయుడు ఎక్కడ కనిపించినా రూ.90వేల కోసం నిలదీయండని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కలిగిరిలో మంగళవారం నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ…. మేనిఫెస్టోలో ప్రతి కులానికి ఒక పేజీ కేటాయించారన్నారు. ఎస్సీలు, బోయలు సహా అందర్నీ మోసం చేశారన్నారు. మళ్లీ ఎన్నికలు రాగానే ఓటుకు రూ.3వేలు చేతిలో పెడతారన్నారు. ఆ డబ్బంతా మనదేనన్నారు. రూ.5వేలు తీసుకోండి.. అయితే ఓటు మాత్రం వంచనకు వ్యతిరేకంగా వేయండి అని అన్నారు. నాలుగేళ్ల క్రితం చంద్రబాబు నాయుడు బెల్టు షాపులను అరికడతానన్నారు. కానీ ఇప్పుడు ఫోన్ చేస్తే మద్యం ఇంటికే వచ్చేస్తోంది’ అన్నారు.రేషన్ షాపుల్లో ప్రస్తుతం బియ్యం మినహా మరేమీ ఇవ్వడం లేదన్నారు. బాబు వస్తే జాబు వస్తుందంటూ నాలుగేళ్ల కిందట విస్తృతంగా ప్రచారం చేసుకున్న చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో ఎంతమందికి జాబులిచ్చారో చెప్పాలన్నారు. రైతులు బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని బయటకు తీసుకొస్తామని చెప్పిన చంద్రబాబు వారిని కూడా మోసం చేశారని విమర్శించారు. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ కావాలంటే బాబు రావాలన్నారని, జాబు రావాలంటే బాబు రావాలన్నారని, మరి అవన్నీ వచ్చాయా? అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు అన్ని కులాల వారికి ఎన్నో హామీలు ఇచ్చి వారంరినీ మోసం చేశారని తెలిపారు.మార్చి  1న వైకాపా నేతలు  రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద  లు ధర్నాలు చేపడతారని జగన్ తెలిపారు. వచ్చేనెల 5న మళ్లీ పార్లమెంటు సమావేశాలు మొదలవుతాయని, నెలరోజులు జరుగుతాయని, ఏప్రిల్ 6 వరకు కొనసాగుతాయని తెలిపారు. ఆ ముప్పై రోజులూ తమ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తూనే ఉంటారని తెలిపారు.
Tags: Everything is Fraud: YS Jagan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *