ఉద్యానవనాలను పరిశీలించిన ఈవో
తిరుమల ముచ్చట్లు:
తిరుమలలో అభివృద్ధి చేసిన ఉద్యానవనాలను టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి శుక్రవారం సివిఎస్వో గోపినాథ్ జెట్టితో కలిసి పరిశీలించారు.శ్రీవారి సేవా సదన్ పక్కన ఉన్న బాట గంగమ్మ గుడి సమీపంలో ఏడు ఎకరాల విస్తీర్ణంలో జరుగుతున్న ఉద్యానవన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పూలమాలల తయారీకి వినియోగించే ప్రత్యేకమైన మిరబుల్ రోజ్ రకం మొక్కను ఈవో నాటారు. అదేవిధంగా, శ్రీసిటి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న రోజాలు, మల్లె, నూరు వరహాలు, లీల్లీలు, పన్నీరాకు, చామంతి మొక్కల పెంపకాన్ని పరిశీలించారు.శ్రీవారికి రోజువారీ కైంకర్యాలకు వినియోగించేందుకు 100 నుండి 150 కిలోల పుష్పాలను సిద్ధం చేస్తామని, మరికొన్ని ఇది సాధ్యమవుతుందని శ్రీసిటి గ్రీనరీ ప్రాజెక్టు ఇన్చార్జి శ్రీ మధురెడ్డి ఈ సందర్భంగా ఈవోకు వివరించారు. ఆలయ అవసరాల కోసం పసుపును కూడా పండిస్తున్నట్టు చెప్పారు. అనంతరం ఉద్యానవనంలో జరుగుతున్న పాలిహౌస్, సీటింగ్ ఏర్పాట్లను ఈవో పరిశీలించారు. ఆ తరువాత ఫిల్టర్ హౌస్, ఎస్ఎంసి, జిఎన్సి, ముళ్లగుంట కూడళ్లలో పూలమొక్కల పెంపకాన్ని పరిశీలించారు.ఈవో వెంట ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, విజివో బాలిరెడ్డి తదితరులు ఉన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్మోహన్రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Evo inspecting the gardens