Examination of applications for ration cards

రేషన్ కార్డులకోసం అందిన దరఖాస్తులు పరిశీలన

Date: 08/12/2017
పెద్దపంజాణి ముచ్చట్లు:
రేషన్ కార్డుల కొరకు కొత్తగా అర్జీదారుల నుంచి వచ్చిన దరఖాస్తులను ఎంపీపీ మురళీకృష్ణ పరిశీలించారు. జన్మభూమి కమిటీ సభ్యులు, అధికారులతో కలసి ఆయన మండల పరిధిలోని కోగిలేరు పంచాయతీకి చెందిన చీకిలదిన్నెపల్లె, పొట్టగానిపల్లె, బసవరాజుకండ్రిగ, కోగిలేరు గ్రామాల్లోని అర్జీదారుల కుటుంబ వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ప్రతిఒక్కరికీ జన్మభూమి కార్యక్రమంలో రేషన్ కార్డులు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు సురేంద్ర, సర్పంచ్ శివయ్య తదితరులు పాల్గొన్నారు.
Tag: Examination of applications for ration cards

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *