429జీవోను అమలు చేయండి- ఎంపీకు పీఎంపి వైద్యులు వినతి.

పుంగనూరు ముచ్చట్లు:
గ్రామీణ వైద్యుల అభ్యున్నతి కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి తీసుకువచ్చిన 429 జీవోను అమలు చేయాలని పుంగనూరు పీఎంపి వైద్యులు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిదున్ రెడ్డికు వినతి పత్రాన్ని సమర్పించారు. బుధవారం రాత్రి పుంగనూరు పట్టణంలో వార్డు బాట ముగింపు సందర్భంగా ఎంపీ పెద్దిరెడ్డి మిదున్ రెడ్డిని కలిసి సమస్యను విన్నవించారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి గ్రామీణ ప్రాంతాల్లో మెడిసిన్ చేసిన వైద్యులు ఉండరని గ్రహించి ప్రత్యేకంగా అనుభవం ఉన్న వైద్యులచే శిక్షణ ఇచ్చి ప్రతి గ్రామంలోనూ ప్రజలకు ప్రథమ చికిత్స చేయాలని 429 జీవోను తీసుకువచ్చారన్నారు. సమస్యను విన్న ఎంపీ మిదున్ రెడ్డి  సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ సి కమిటీ ఛైర్మన్ డాక్టర్ శరన్ కుమార్, పీఎంపి వైద్యులు అమరనాథ్, రత్నం, లక్ష్మీ నారాయణ, హరిప్రసాద్, బాబు, రేణుక, రషీదా భేగం, రాధా తదితరులు పాల్గొన్నారు.
 
Tags:Execute 429 Jivo- PMP doctors request to MP

Natyam ad