కర్నూలు జిల్లా చెన్నంపల్లికోటలో అపార ఖనిజ సంపద

Date: 11/01/2018

కర్నూలు ముచ్చట్లు::

జిల్లాలోని తుగ్గలి మండలం చెన్నంపల్లికోటలో అపార ఖనిజ సంపద ఉన్నట్లు గుర్తించామని ఆదోని ఆర్డీవో ఓబులేసు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… కోటలో రెడ్ చిప్ గ్రానైట్, క్వార్జ్ వంటి విలువైన ఖనిజాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా… శ్రీకృష్ణదేవరాయుల కాలం నాటి చెన్నంపల్లి కోటలో బంగారం, వజ్రాల నిక్షేపాలున్నట్లు స్థానికుల నమ్మకం. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడంతో ఇటీవల తవ్వకాలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో మైనింగ్, రెవెన్యూ, గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున దాదాపు 20 రోజులపాటు తవ్వకాలు జరిగాయి. ఈ తవ్వకాల్లో ఏనుగు దంతాలు, మూడు తలల నాగుపడగ, కొన్ని జంతు కళేబరాల అవశేషాలు లభించాయి. కాగా… కొద్ది రోజుల విరామం అనంతరం మళ్ళీ తవ్వకాలు జరుగుతున్నాయి. ఈనేపధ్యంలో ఆదోని ఆర్డీవో ఓబులేసు విలేకరులతో మాట్లాడుతూ.. రెడ్ చిప్ గ్రానైట్, క్వార్జ్ వంటి విలువైన ఖనిజాలున్నట్లు గుర్తించామని తెలిపారు.

Tags: Extensive mineral wealth in Chennai in Kurnool district

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *