Fack on niche placement agents!

నకీలీ ప్లేస్‌మెంట్ ఏజెంట్లపై కొరడా!

-నెలరోజుల్లో రిజస్ట్రేషన్ తప్పనిసరి

-లేకుంటే క్రిమినల్ కేసులు తప్పవు

-కార్యాలయాల స్వాధీనానికీ ఆదేశాలు

-వీసా మోసాలకు పాల్పడే వారీపై పీడీ యాక్టు

-వీదేశాల్లో ఉపాధికి టామ్‌కాం సహాకారం

-ఏన్నారై వ్యవహారాలపై మంత్రుల సమీక్ష

Date: 14/01/2018

హైదరాబాద్ ముచ్చట్లు:

ఏన్నారై వ్యవహారాల మంత్రిత్వ శాఖ పనితీరుపై ఆ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డితో కలిసి శనివారం ఇక్కడ సమీక్షించారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో పోలీస్, హోం, ఏన్నారై శాఖల అధికారులు పాల్గొన్నారు. గత వారంలో డిల్లీలో విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి అధ్వర్యంలో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలను, రాష్ర్ట స్ధాయిలో అమలు చేసేందుకు ఈ సమావేశం నిర్వహించారు. బతుకుతెరువు కోసం వీదేశాలకు వెళ్లేవారిని మోసం చేస్తున్న నకీలీ గల్ప్ ఏజెంట్ల పైన కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. నకీలీ ఏజెంట్లపైన గట్టి చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అధికారులను మంత్రులు అదేశించారు. ఈ-మైగ్రేట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఏజెంట్లకు నెలరోజుల సమయం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నెల రోజుల్లోగా నమోదు చేసుకోని వారందరినీ అక్రమ ఏజెంట్లుగా గుర్తిస్తామని మంత్రులు తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకోని అక్రమ ఏజెంట్ల పైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని, ప్రభుత్వ హెచ్చరికలు ఖాతారు చేయకుండా పదేపదే వీసాల మోసాలకు పాల్పడే నకీలీ ఏజెంట్లపై పీడీ యాక్టు ప్రయోగించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో పాల్గోన్న డీజీపీ మహేందర్‌రెడ్డి ఈ నకీలీ ఏజెంట్లపైన చర్యలు తీసుకుటుంటామని, ఇందుకు సంబంధించి త్వరలోనే మార్గదర్మకాలు జారీ చేస్తామని తెలిపారు. అక్రమ ఏజెంట్ల పైన చర్యలు తీసుకునే విషయంలో పోలీసులకు ప్రజలు సహకరించాలని మంత్రులు విజ్ఝప్తి చేశారు. ‘సురక్షితంగా వెళ్లండి, సుశిక్షితులై వెళ్లండి’ అనే కేంద్ర ప్రభుత్వ విదేశాంగ శాఖ నినాదానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వ టామ్‌కాం కంపెనీ ద్వారా చట్టపరంగా విదేశాలకు వెళ్లాలన్నారు. దీంతోపాటు రాష్ర్టంలో ఉన్న రిజిస్టర్డ్ ఏజెంట్ల ద్వారానే వెళ్లాలని మంత్రులు కోరారు. హైదరాబాద్‌లో విదేశీ భవన్‌కు ఫిబ్రవరి రెండో వారంలో శంకుస్థాపన చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్న మంత్రులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఏన్నారై శాఖాధికారులకు అదేశాలు జారీ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నారైలకు, వసల కార్మికుల కోసం చేపడుతున్న చర్యలను, ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలని మంత్రి కెటి రామారావు తెలిపారు. గల్ఫ్ దేశాలకు జరుగుతున్న మహిళల అక్రమ రవాణా, మోసపూరిత వివాహాలపైన మరింత కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఈ విషయంలో రాష్ర్ట పోలీసు శాఖ గతకొంత కాలంగా తీసుకుంటున్న చర్యలను మంత్రి అభినందించారు. ఇలాంటి మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో మైనార్టీ సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, ఎన్నారై శాఖ, పోలీస్ శాఖలు ఉమ్మడి సంయుక్త సమన్వయ బృందాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇక్కడ పోలీసుల చర్యలతో ముంబయి, కలకత్తా వంటి ప్రాంతాల నుంచి ఈ ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్న నేపధ్యంలో అయా రాష్ట్రాల అధికారుల సహాకారం తీసుకోవాలని సూచించారు. ఈ మానవ అక్రమ రవాణకు పాల్పడుతున్న ఏజెంట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఈ మేరకు పాస్ పోర్టు కార్యాలయ అధికారుల సహాకారం తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డిజిపి మహేందర్ రెడ్డి, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది, ఏన్నారై, పోలీసు శాఖాధికారులు పాల్గొన్నారు.

Tags: Fack on niche placement agents!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *